మెస్సీ మెరుపు గోల్.. కీలక మ్యాచ్ లో సత్తా చాటిన కెప్టెన్!

మెస్సీ మెరుపు గోల్.. !

  • కీలక మ్యాచ్ లో సత్తా చాటిన కెప్టెన్
  • అర్జెంటీనా నాకౌట్ ఆశలు సజీవం
  • మెక్సికో తో హోరాహోరీగా తలపడ్డ అర్జెంటీనా
  • ఖతార్ లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్

ఫిఫా వరల్డ్ కప్ 2022 లో తొలి మ్యాచ్ లోనే సౌదీ అరేబియా చేతిలో ఓటమి చవిచూసిన అర్జెంటీనా.. రెండో మ్యాచ్ నాటికి పుంజుకుంది. చిరకాల ప్రత్యర్థి మెక్సికోతో శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన మ్యాచ్ లో చెలరేగింది. మ్యాచ్ సెకండ్ హాఫ్ లో మెరుపు గోల్ చేసి అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ మెక్సికో జట్టుపై పైచేయి సాధించగా.. ఎంజో ఫెర్నాండెజ్ మరో గోల్ చేసి 2-0 గోల్స్ తేడాతో జట్టును గెలిపించారు. దీంతో అర్జెంటీనా నాకౌట్ అవకాశాలు సజీవంగా నిలిచాయి.

ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ లో ప్రి క్వార్టర్స్ కు చేరడానికి ప్రతి జట్టూ తీవ్రంగా కృషి చేస్తోంది. గ్రూప్ సీ లో భాగంగా శనివారం మెక్సికోతో జరిగిన మ్యాచులో అర్జెంటీనా సత్తా చాటింది. ఫస్ట్ హాఫ్ లో రెండు జట్లు కూడా గోల్ చేయలేకపోయాయి. సెకండ్ హాఫ్ లో అర్జెంటీనా ఆటగాళ్లు రెచ్చిపోయారు. అటాకింగ్ గేమ్ తో దూకుడు పెంచి రెండు గోల్స్ చేశారు. ఆట 64 వ నిమిషంలో కెప్టెన్ మెస్సీ అదిరిపోయే గోల్ చేశాడు. 87 వ నిమిషంలో ఎంజో ఫెర్నాండేజ్ మరో గోల్ చేయడంతో అర్జెంటీనా జట్టు 2-0 తో మ్యాచ్ లో విజయం సాధించింది.

Leave a Reply

%d bloggers like this: