Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పొమ్మంటున్న అమెరికా కంపెనీలు… రారమ్మంటున్న హైదరాబాద్ సంస్థలు!

పొమ్మంటున్న అమెరికా కంపెనీలు… రారమ్మంటున్న హైదరాబాద్ సంస్థలు!

  • ఇటీవల ఉద్యోగులను తొలగిస్తున్న ప్రముఖ సంస్థలు
  • ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి
  • పనిలో నాణ్యత ముఖ్యమని భావిస్తున్న కంపెనీలు
  • వేల సంఖ్యలో ఉద్యోగాల కోత
  • తాము ఉద్యోగాలిస్తామంటున్న హైదరాబాద్ సంస్థలు

కొవిడ్ మహమ్మారి సృష్టించిన సంక్షోభం, ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడులు, తదితర పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థలు తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి. అనేక అంతర్జాతీయ సంస్థలు ఖర్చులను తగ్గించుకునే పనిలో నిమగ్నమయ్యాయి.

ఎలాన్ మస్క్ వంటి కుబేరుడు సైతం తన ట్విట్టర్ లో భారీగా ఉద్యోగాల కోత విధిస్తున్నారు. ఇప్పుడదే బాటలో అగ్రరాజ్యం అమెరికాలోని పలు సంస్థలు కూడా నడుస్తున్నాయి. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ది కూడా ఇదే ఒరవడి! లే ఆఫ్స్ పేరిట పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

అయితే భారత్ లోని పలు సంస్థలు మాత్రం కొత్త ఉద్యోగులకు ద్వారాలు తెరుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే టెక్ సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగ నియామకాలకు ప్రకటనలు ఇస్తున్నాయి.

హైదరాబాద్ లో ఇన్నోవేషన్ సెంటర్ నడిపిస్తున్న ఇన్నోమైండ్స్ సొల్యూషన్స్ 100 మంది నిపుణులను తీసుకునేందుకు ఆసక్తి చూపుతోంది. ఇక, నగరానికే చెందిన బ్లూ సఫైర్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ కూడా టెక్, నాన్ టెక్ విభాగాల్లో కొత్త ఉద్యోగులకు స్వాగతం పలుకుతోంది. సుమారు 90 నుంచి 120 మందిని నియమించుకునేందుకు సన్నద్ధమవుతోంది.

టెక్ సంస్థలే కాదు, ఆర్థిక సేవల సంస్థలు కూడా తాజా నియామకాలపై దృష్టి సారించాయి. సోషల్ మీడియాలో ఎక్కువగా ఆయా సంస్థలకు చెందిన రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ సోషల్ మీడియా పోస్టుల కింద యూఎస్ లే ఆఫ్స్, మెటా లే ఆఫ్స్, అమెజాన్ లే ఆఫ్స్, హైరింగ్2022 వంటి హ్యాష్ ట్యాగ్ లతో నిపుణులను ఆకర్షిస్తున్నాయి. ఈ సంస్థలు తాము నియమించుకునే కొత్త ఉద్యోగులను భారత్ లోనే కాదు, అమెరికాలోని తమ బ్రాంచిల్లో పనిచేసేందుకు కూడా వినియోగించుకోనున్నాయి.

Related posts

హిజాబ్ వివాదాన్ని అడ్డుపెట్టుకుని ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు కుట్ర!: నిఘా వర్గాల హెచ్చరిక!

Drukpadam

ఇది రైతు ప్రభుత్వం …దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 10 వేలు ఇస్తాం:కేసీఆర్ 

Drukpadam

Here Are 8 Editors-Approved IGK Hair Products You Need to Try

Drukpadam

Leave a Comment