చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడు!

చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడు!

  • ర్యాలీగా అనంతపురం వచ్చి ఎస్పీని కలిసిన చంద్రశేఖరరెడ్డి
  • ఆవేదనతో చంద్రబాబు కుటుంబంపై ఏదైనా మాట్లాడి ఉంటే క్షమించాలన్న ఎమ్మెల్యే సోదరుడు
  • పార్టీ శ్రేణులు, ప్రజల తరపున క్షమాపణ చెప్పిన చంద్రశేఖరరెడ్డి 

రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం ..అందులో గుడ్డి విమర్శలు ఉంటాయి. ఏ విమర్శలు అయినా తిరిగి వెనక్కు తీసుకోవడం రాజకీయనాయకులు అంతతేలిగ్గా ఒప్పుకోరు .కానీ రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఉందతనంగా వ్యహరించి చంద్రబాబు నాయుడు కుటుంబంపై విమర్శలు చేసి ఉంటె క్షిపణలు కోరుతున్నట్లు తెలిపి తన పెద్ద మనసును చాటుకున్నాడు .ఇది రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. చంద్రశేఖర్ రెడ్డి ఉందతనంగా వ్యహరించి పెద్ద మనసు చాటుకోవడంపై పలువురు ప్రశంసిస్తున్నారు .

అసలేం జరిగిందంటే

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వైసీపీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చంద్రశేఖరరెడ్డి క్షమాపణలు చెప్పారు. ఎస్పీని కలిసేందుకు నిన్న అనుచరులతో కలిసి ర్యాలీగా అనంతపురం వచ్చిన చంద్రశేఖరెడ్డి ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు.

తమ విధానాలను చెప్పే విషయంలో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై ఆవేదనతో ఏదైనా మాట్లాడి ఉంటే ఈ ప్రజల తరపున, పార్టీ శ్రేణుల తరపున తాను క్షమాపణ కోరుతున్నట్టు చంద్రశేఖరరెడ్డి తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: