మోదీగారూ, మీ ముఖాన్ని మేము ఎన్నిసార్లు చూడాలి?: మల్లికార్జున ఖర్గే ఘాటు విమర్శ!

మోదీగారూ, మీ ముఖాన్ని మేము ఎన్నిసార్లు చూడాలి?: మల్లికార్జున ఖర్గే ఘాటు విమర్శ!
-ప్రధాని అనే విషయాన్ని మర్చిపోయి అన్ని ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని మండిపాటు
-కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ప్రచారం చేస్తున్నారని విమర్శ
-అభ్యర్థి పేరు చెప్పి ఓట్లు అడగాలన్న ఖర్గే

ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటు విమర్శలు గుప్పించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కొన్ని గంటల్లో ముగుస్తున్న సమయంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీని రావణుడితో పోల్చారు. మోదీని ఎన్నిసార్లు చూడాలని ఆయన ప్రశ్నించారు. ఆయనకేమైనా వంద తలలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

తాను దేశ ప్రధాని అనే విషయాన్ని మర్చిపోయి అసెంబ్లీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు ఇలా ప్రతి చోటా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీజీ, మీ ముఖాన్ని మేము ఎన్ని సార్లు చూడాలి? అంటూ ఎద్దేవా చేశారు. ప్రతి ఎన్నికల్లో మోదీ పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతోందని విమర్శించారు. అభ్యర్థి పేరు చెప్పి ఓటు అడగాలని… మోదీ వచ్చి మున్సిపాలిటీకి పని చేస్తారా? అని మండిపడ్డారు. అసెంబ్లీకి అవసరమైన సమయాల్లో ఆయన వచ్చి మీకు సాయం చేయగలరా? అని ప్రశ్నించారు. అహ్మదాబాద్ లోని బెహ్రాంపూర్ లో నిర్వహించిన ఒక బహిరంగసభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

%d bloggers like this: