బెంగళూరు డ్రగ్స్ కేసులో ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర: బండి సంజయ్..

బెంగళూరు డ్రగ్స్ కేసులో ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పాత్ర: బండి సంజయ్..
-డబ్బులిచ్చి కేసు కొట్టివేయించుకున్నారని ఆరోపణ
-ఆ కేసును రీ ఓపెన్ చేయిస్తున్నామని వెల్లడి
-ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ లో మాట్లాడిన బీజేపీ నేత
-బెంగళూరులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ దందా చేస్తున్నారన్న సంజయ్

కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసిన డ్రగ్స్ కేసుకు సంబంధించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. ఈ కేసు ఇప్పటికే క్లోజ్ కాగా… ఈ కేసును రీఓపెన్ చేయిస్తున్నామని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ లో గురువారం మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును క్లోజ్ చేయించుకునేందుకు కర్ణాటక పోలీసులకు టీఆర్ యస్ భారీగానే డబ్బులించిందని ఆరోపణలు గుప్పించారు .తమ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కేసు క్లోస్ కావడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు . అందువల్లనే ఆ కేసును రీ ఓపెన్ చేస్తున్నామని వెల్లడించారు

బెంగళూరులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ దందా చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ఈ క్రమంలో బెంగళూరు డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల పాత్ర ఉందని బెంగళూరు పోలీసులు నిర్ధారించారన్నారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరు పోలీసులకు డబ్బులిచ్చి మరీ కేసును కొట్టివేయించుకున్నారన్నారు. కర్ణాటకలో తమ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా టీఆర్ఎస్ నేతలు ఈ కేసులో తమ పేర్లను కొట్టివేయించుకున్నారని ఆయన చెప్పడం గమనార్హం .

Leave a Reply

%d bloggers like this: