Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణాలో పొత్తులపై సిపిఐ కార్యదర్శి కూనంనేని ఆసక్తికర వ్యాఖ్యలు …

మునిగిపోయే కాంగ్రెస్ కు మేమెందుకు మద్దతు ఇవ్వాలి?: సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు!

  • టీఆర్ఎస్ తో పొత్తు శాశ్వతమేమీ కాదన్న కూనంనేని
  • పాలేరు లాంటి నియోజకవర్గాల్లో గెలిచేందుకు యత్నం
  • ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఎర్రజెండాలు కనిపిస్తాయని వ్యాఖ్య

తెలంగాణలో రాజకీయ పొత్తులకు సంబంధించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గురువారం పలు వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ముగిసిన మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్ష పార్టీలు అధికార టీఆర్ఎస్ కు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్ సులభంగానే గెలుచుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజల పక్షాన పోరాటం సాగించే వామపక్షాలు అధికార పార్టీలకు ఎలా మద్దతు పలుకుతాయని ఎన్నికల నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. వీటిన్నింటికీ సమాధానం ఇస్తూ కూనంనేని గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్ తో పొత్తు శాశ్వతమేమీ కాదని కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటలో ఏర్పాటు చేసిన సీపీఐ పాలేరు నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు    వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని ఇప్పుడే చెప్పలేమని కూడా ఆయన తెలిపారు. తమకు మంచి పట్టు ఉన్న పాలేరు లాంటి నియోజకవర్గాల్లో గెలిచేందుకు యత్నిస్తామని చెప్పారు. ఎర్ర జెండాలు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా కనిపిస్తాయని ఆయన అన్నారు.

కమ్యూనిస్టుల జోలికొస్తే ఎవ్వరినీ ఉపేక్షించబోమని కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. . ‘‘అసమానతలు లేని సమాజం కోసమే కమ్యూనిస్టు సిద్ధాంతం వచ్చింది. ప్రపంచంలో ఎక్కడకెళ్లినా ఎర్రజెండా ఉంటుంది. ఎర్రజెండాకు మరణం లేదు శాశ్వత మైన జెండా ఎర్రజెండా. మనుషులు ఉన్నంత కాలం ఎర్రజెండా ఉంటుంది. మా పార్టీ విధానం మాకు తెలుసు. జనం కోసం పుట్టిన పార్టీ. పదవులు ముఖ్యం కాదు. ఎందరో మహానుభావులు ఎర్రజెండా పార్టీ కోసం త్యాగం చేశారు. బీజేపీ ఏం చేసిందని అధికారంలోకి వచ్చింది. మతం పేరుతో బీజేపీ ప్రజలను రెచ్చగొడుతుంది. కులాల, మతాల మధ్య చిచ్చు పెడుతూ అధికారం కోసం ప్రాకులాడుతున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి దేశాన్ని ఆదానీ, అంబానీకి అమ్ముతున్నారు. మునిగిపోయే కాంగ్రెస్‌కు మేము ఎందుకు సపోర్ట్ చేయాలి. టీఆర్ఎస్‌ తో పొత్తు శాశ్వతం కాదు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నాం. మన పార్టీని బ్రతికించుకుందాం. ఏ సమస్య వచ్చినా ప్రజల పక్షాన నిలబడతాం. జనంలోనే ఉందాం.. జనం కోసం పోరాటం చేద్దాం.’’ అని కార్యకర్తలకు సాంబశివరావు పిలుపునిచ్చారు.

Related posts

బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే:కపిల్‌ సిబల్‌…

Drukpadam

కండోమ్స్ ఎక్కువ‌గా వాడేది ముస్లింలే: ఎంపీ అస‌దుద్దీన్!

Drukpadam

తెలంగాణను మళ్లీ ఏపీలో చేర్చేందుకు మోదీ కుట్ర: హరీశ్ రావు

Drukpadam

Leave a Comment