Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఈడీ అదుపులో అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రి సీఎండీ మణి!

ఈడీ అదుపులో అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రి సీఎండీ మణి!

  • విజయవాడలో అక్కినేని ఆసుపత్రిపై ఈడీ దాడులు
  • ఆసుపత్రి ఫోన్ల స్వాధీనం
  • సీఎండీ మణిని రహస్యంగా విచారిస్తున్న వైనం
  • ఆసుపత్రి చుట్టూ సీఆర్పీఎఫ్ బందోబస్తు

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ ,ఐటీ, సిబిఐ దాడులు అక్రమార్కులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే అక్రమార్కులను చేస్తే మంచిదే ఆపేరుతో రాజకీయ కక్షలు కార్పణ్యాలు పెరుగుతున్నాయి. తమను ఎదురు తిరుగుతున్నా వారిపై టార్గెట్ చేసి కేంద్రం నిఘా సంస్థలను పంపుతుందని విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. ఇప్పటికే తెలంగాణాలో టీఆర్ యస్ నేతలు వారి అనుయాయిలు వారికీ మద్దతు ఇచ్చేవారిని లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దాడులు జరగటంతో రాజకీయాలవైపు టర్న్ తీసుకుంటుంది. ఫలితంగా వ్యాపారవేత్తలు , పారిశ్రామిక వేత్తలు హడలి పోతున్నారు . తెలంగాణ లో కాషాయ జెండా ఎగర ఏయాలని అనుకుంటున్నా బీజేపీ మరిన్ని దాడులు చేయించే అవకాశం ఉందని అందుకు టీఆర్ యస్ నేతలు ఎవరు భయపడాల్సిన పనిలేదని కేసీఆర్ చెప్పినట్లు నేతలు చెప్పడం గమనార్హం …

విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ సీఎండీ మణిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ అధికారులు మణిని రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. విదేశీ పెట్టుబడులు, నిధుల మళ్లింపుపై ఈడీ ఆరా తీస్తోంది. ఎన్నారై, మేనేజ్ మెంట్ కోటాల్లో మెడికల్ సీట్లకు కోట్ల నిధులు వసూలు చేసినట్టు మణిపై ఈడీకి సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి నేటి రాత్రి వరకు ఈడీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.

ఇప్పటికే ఈడీ అధికారులు ఆసుపత్రి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రిలోకి ఎవరినీ రానివ్వకుండా ఈడీ అధికారులు సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారు. విజయవాడలో అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ గత ఆగస్టులోనే ప్రారంభమైంది.

Related posts

భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత…

Ram Narayana

అన్యాక్రాంతం అయిన వక్ఫ్ భూములను వెనక్కు తీసుకోవాలి:భట్టి

Drukpadam

బలహీనులకు అండగా సుప్రీంకోర్టు-అది వారికీ తెలుసు-ఛీఫ్ జస్టిస్ రమణ కామెంట్స్

Drukpadam

Leave a Comment