పవన్ కల్యాణ్ కు పెళ్లి కార్డు కూడా ఇచ్చాను… కానీ రాలేకపోయారు: అలీ

పవన్ కల్యాణ్ కు పెళ్లి కార్డు కూడా ఇచ్చాను… కానీ రాలేకపోయారు: అలీ

  • ఇటీవల అలీ కుమార్తె వివాహం
  • హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
  • పెళ్లికి హాజరుకాని పవన్ కల్యాణ్
  • మీడియాలో కథనాలు ..స్పందించిన అలీ

టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ ఇటీవల తన కుమార్తె వివాహం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. గుంటూరులో పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేయగా, ఏపీ సీఎం జగన్ కూడా విచ్చేశారు.

కాగా, అలీ కుమార్తె పెళ్లికి జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం హాజరుకాలేదు. ఒకప్పుడు పవన్, అలీ మధ్య సాన్నిహిత్యం నేపథ్యంలో, ఈ పెళ్లికి పవన్ తప్పకుండా హాజరవుతాడని భావించారు. ఆయన రాకపోవడంతో రకరకాలుగా ప్రచారం జరిగింది.

పవన్ విషయంలో వస్తున్న కథనాల పట్ల అలీ స్పందించారు. రామోజీ ఫిలింసిటీలో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ జరుగుతుంటే తాను అక్కడికి వెళ్లి పవన్ కల్యాణ్ కు, దర్శకుడు క్రిష్ కు, నిర్మాత ఏఎం రత్నంకు పెళ్లి కార్డు ఇచ్చానని వెల్లడించారు. వివాహానికి తప్పకుండా వస్తామని చెప్పారని అలీ తెలిపారు.

కానీ, వారికి ఎక్కడో మీటింగ్ ఉండడం వల్ల సమయానికి ఫ్లయిట్ అందుకోలేకపోయారని వివరించారు. తర్వాత పవన్ కల్యాణ్ ఫోన్ చేసి పెళ్లికి రాలేకపోయాను అలీ ఏమనుకోవద్దు అని వివరణ ఇచ్చారని వెల్లడించారు. మీ అమ్మాయి, అల్లుడు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేయి… నేనే పర్సనల్ గా వచ్చి కలుస్తాను అని చెప్పారని తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: