లక్షల మందికి ఉద్యోగ ద్వారాలు తెరుస్తున్న కెనడా!

లక్షల మందికి ఉద్యోగ ద్వారాలు తెరుస్తున్న కెనడా!

  • కెనడాలో ఉద్యోగాల కొరత
  • ప్రభుత్వం కీలక నిర్ణయం
  • విదేశీయుల జీవిత భాగస్వాములకు కూడా ఉద్యోగాలు
  • నిబంధనల సడలింపు

ఉద్యోగుల కొరతను అధిగమించేందుకు కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పనిచేస్తున్న విదేశీయులు జీవిత భాగస్వాములు, వారి పిల్లలు కూడా ఉద్యోగాలు చేసేందుకు నిబంధనలను సడలించింది. ఈ నిర్ణయంతో 2 లక్షల మందికి పైగా విదేశీయులు లబ్ది పొందనున్నారు. ఈ నిర్ణయం 2023 జనవరి నుంచి అమల్లోకి రానుంది. రెండేళ్ల పాటు తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఉద్యోగావకాశాలను కల్పిస్తారు. దశలవారీగా అమలు చేసే ఈ కార్యాచరణను రెండేళ్ల తర్వాత సమీక్షించనున్నారు. 

ఈ నిర్ణయంతో ఆరోగ్య రంగం, వాణిజ్యం, ఆతిథ్య సేవల రంగాల్లో పనిచేస్తున్న విదేశీయుల కుటుంబాలకు చెందినవారు ఉద్యోగాలు పొందేందుకు మార్గం సుగమం కానుంది. 

కెనడా ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు మధ్య కాలంలో 6.45 లక్షల వర్క్ పర్మిట్లు జారీ చేసింది. గతేడాది కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ. 2021లో 1.63 లక్షల వర్క్ పర్మిట్లు జారీ చేశారు. 

ఇప్పటిదాకా అత్యున్నత  నైపుణ్యం కలిగిన ఉద్యోగుల భార్యలు మాత్రమే ఉద్యోగాలు పొందే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు దాన్ని మరింత మంది ఉద్యోగులకు విస్తరిస్తున్నారు. తద్వారా కెనడాలోని అనేక సంస్థల మానవ వనరులు బలోపేతం కానున్నాయి.

Leave a Reply

%d bloggers like this: