Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విచారణకు రమ్మంటూ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు!

విచారణకు రమ్మంటూ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు!

  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ నోటీసులు
  • ఈ నెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలన్న సీబీఐ
  • హైదరాబాద్ లో కానీ, ఢిల్లీలో కానీ విచారణకు హాజరు కావచ్చన్న సీబీఐ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. హైదరాబాద్ లో కానీ, ఢిల్లీలో కానీ ఎక్కడైనా విచారణకు హాజరుకావచ్చని తెలిపింది. 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్కామ్ లో కవిత పాత్ర ఎంత ఉందనే కోణంలో సీబీఐ విచారణ జరపనుంది.

కవితకు సీబీఐ నోటీసులు జారీ కావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఆమెకు సంఘీభావం తెలిపేందుకు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ లోని ఆమె నివాసానికి చేరుకుంటున్నారు.

తనకు పై కేసులో ఎఫ్ ఐ ఆర్ కాపీని అందజేయాలని ఎమ్మెల్సీ కవిత సిబిఐ అధికారులను కోరుతూ లేఖ రాశారు .లేఖను అందజేయాలని కూడా ఆ లేఖలో కోరారు .అందుకు సిబిఐ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో అనే ఆసక్తి నెలకొన్నది .సిబిఐ నోటీసులపై కవిత ప్రగతిభవనంలో తన తండ్రి సీఎం కేసీఆర్ ను కలిసి  చర్చించారు . ఆతర్వాతనే ఆమె సిబిఐ అధికారులకు లేక రాయడం గమనార్హం.

Related posts

ఇమ్రాన్‌కు షాక్.. అవిశ్వాస తీర్మానంలో ఓటమి..

Drukpadam

దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు: సుప్రీం

Drukpadam

ఐటీ దాడులు తర్వాత.. తొలిసారి భావోద్వేగంతో స్పందించిన సోను సూద్!

Drukpadam

Leave a Comment