నేనో ఫైల్యూర్ పొలిటిసిన్ ను …అంగీకరించిన పవన్ కళ్యాణ్!

నేనో ఫైల్యూర్ పొలిటిసిన్ ను …అంగీకరించిన పవన్ కళ్యాణ్!
-అందుకు నేనేమి చింతంచటంలేదు
-ఓడిపోయానని చెప్పేందుకు మొహమాటపడనని వివరణ
-శిల్పకళావేదికలో సీఏ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సు… హాజరైన పవన్ కల్యాణ్
-‘ఫేసింగ్ ద ఫ్యూచర్’ అంశంపై పవన్ ప్రసంగం
-ఫెయిల్యూర్స్ నుంచే విజయాలు అందుకుంటామనే విశ్వాసం ఉంది
-నేను అనేకం సాదించగలిగాను
-పరాజయంలోనే జయం ఉందని స్పష్టీకరణ

పవన్ కళ్యాణ్ తొలిసారిగా రాజకీయాల్లో తన ఫెయిల్యూర్స్ ను అంగీకరించారు . హైదరాబాదులోని శిల్పకళావేదికలో సీఏ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అతిధిగా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ నీతిగా ,నిజాయతీగా తన ఫెయిల్యూర్స్ గురించి చెప్పటంతో అక్కడకు హాజరైన వారు ఆయన నిజాయతీని మెచ్చుకుంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు .

ఇప్పటిదాకా తాను రాజకీయాల్లో విఫలమైన నాయకుడి కిందే లెక్క అని వెల్లడించారు. ఓడిపోయానని చెప్పేందుకు ఎంతమాత్రం మొహమాటపడబోనని స్పష్టం చేశారు.

తన పరాజయాల గురించి ధైర్యంగా మాట్లాడగలనని అన్నారు. పరాజయంలోనే జయం ఉందన్న విషయం మర్చిపోరాదని తెలిపారు. గెలుపును సగం పునాది వేసేది ఓటమేనని అభిప్రాయపడ్డారు.

‘పేరు, డబ్బు ఉన్నవారంతా మహానుభావులు అనుకోవద్దు.. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఏది ఒప్పు, ఏది తప్పు అని నిర్ణయించుకోవాలని, వ్యక్తిగత విజయమే దేశానికి పెట్టుబడి అని పిలుపునిచ్చారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ‘ఫేసింగ్ ద ఫ్యూచర్’ అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

Leave a Reply

%d bloggers like this: