పాలేరులో తాను పోటీచేసేందుకు తాతా మధు తగాదాలు పెడుతున్నారు …సిపిఐ ఆరోపణ…!

పాలేరులో తాను పోటీచేసేందుకు తాతా మధు తగాదాలు పెడుతున్నారుసిపిఐ ఆరోపణ…!
చిన్న విషయాన్నీ సిపిఐ పెద్దది చేస్తుందిఎమ్మెల్సీ తాతా మధు
కూర్చుని మాట్లాడేందుకు సిపిఐ ఇష్టపడటంలేదు
ఎన్ని సార్లు ఫోన్ చేసినా సిపిఐ నేతలనుంచి స్పందన లేదు
పిచ్చుక మీద బ్రహ్మస్త్రం లాగా సాంబశివరావు వ్యవహరించడం ఏమిటి ?

ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో సిపిఐ ,టీఆర్ యస్ మధ్య ఏర్పడిన అగాధం రెండు పార్టీల మధ్య సఖ్యతను దెబ్బతీసేలా ఉంది .ఖమ్మం రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు సిపిఐ ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రత్యేకంగా సిపిఐ జిల్లా సహాయకార్యదర్శిగా ఉన్న దండి సురేష్ ను టర్గెట్ చేసుకొని వ్యవహరించడంపై సిపిఐ శ్రేణులు భగ్గుమంటున్నాయి.సి స్థానిక టీఆర్ యస్ నాయకుడు బెల్లం వేణు ఏది చెపితే అది చేస్తూ సిపిఐ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని సిపిఐ ఆరోపణ . అందువల్ల సి శ్రీనివాస్ రావు ను రూరల్ నుంచి బదిలీ చేయాలనీ సిపిఐ డిమాండ్ చేస్తుంది . ఇటీవల మునుగోడు ఎన్నికల్లో అధికార టీఆర్ యస్ కు మద్దతు ప్రకటించిన సిపిఐ సీఎం కేసీఆర్ కు దగ్గరైంది. సిపిఐ కి రూరల్ సి శ్రీనివాస్ రావుకు సంబంధాలు సరిగా లేవుసిపిఐ కార్యదర్శిగా ఎన్నికై మొదటిసారి ఖమ్మం వచ్చిన కూనంనేని సాంబశివరావు సిపిఐ కి బలమైన ప్రాంతంగా ఉన్న వరంగల్ క్రాస్ రోడ్ లో ఘనస్వాగతం లభించింది . సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ సి పై ఫైర్ అయ్యారు . దీనికి పోలీసులు సాంబశివరావు తోపాటు రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు పైన కేసు పెట్టారు . పార్టీ రాష్ట్ర నేతలపై కేసులు పెట్టడంపై సిపిఐ శ్రేణులు మండిపడ్డాయి. పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కు పిలుపు ఇచ్చిన సందర్భంలో సిపిఐ నాయకులతో స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడి సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు . దీంతో పోలీస్ స్టేషన్ ముందు చేయ తలపెట్టిన ధర్నాను తాత్కాలికంగా రద్దు చేసుకున్నట్లు సిపిఐ జిల్లా కమిటీ ప్రకటించిందని. సమస్య సమసి పోయిందని అందరు అనుకున్నారు .కానీ సిపిఐ డిమాండ్ పరిస్కారం కాలేదు . సి ఇక్కడ నుంచి బదిలీ అవ్వలేదు. ఖమ్మం సీపీ దగ్గరనుంచి రాష్ట్ర డీజీపీ వరకు సిపిఐ నేతలు కలిసి ఖమ్మం రూరల్ సి పై చేసినా ఫిర్యాదులు బుట్టదాఖలు అయ్యాయని సిపిఐ భావిస్తుంది . మునుగోడులో టీఆర్ యస్ గెలుపు కోసం తమ సహకారం అందించినప్పటికీ తమ నాయకులపై కేసులు ఉపసంహరించుకోకపోగా స్థానిక నాయకులు తమ పార్టీ కార్యకర్తలపై పోలీస్ కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేయడంపై సిపిఐ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు . ఇందుకు టీఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు , పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కారణమని మండిపడుతున్నారు . సి విషయంలో తగదని పరిష్కరిస్తామని స్థానిక ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. తాతా మధు, కందాల ఉపేందర్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు మధ్య తగాదాలు పెట్టి పాలేరులో తానే పోటీ చేయాలనీ అనుకుంటున్నాడని సిపిఐ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇటీవల రూరల్ లో తాతా మధు పర్యటనల్లో చేస్తున్న ప్రసంగాలు రెచ్చగొట్టేవిలా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు . ఇదే వైఖరి కొనసాగితే తమపద్ధతిలో తాము వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు. దీనిపై సిపిఐ జిల్లా కార్యాలయం గిరిప్రసాద్ భవనంలో ఏర్పాటు చేసినా విలేకర్ల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోటీ ప్రసాద్ సిపిఐ జిల్లా నాయకులు మహమ్మద్ మౌలానా , జమ్ముల జితేందర్ రెడ్డి , సిద్దినేని కర్ణకుమార్ ,గోవిందరావు , ఏపూరి రవీంద్రబాబు లు పాల్గొన్నారు .

సిపిఐ చిన్న విషయాన్నీ పెద్దది చేసి చూస్తుందిఎమ్మెల్సీ మధు

సిపిఐ తో టీఆర్ యస్ కు రూరల్ మండలంలో వస్తున్నా తగాదాలను గురించి తాతామాధును ప్రశ్నించగా సిపిఐ చిన్న విషయాన్నీ పెద్దది చేస్తుందని ఎమ్మెల్సీ టీఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు .కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిస్కారం అవుతాయని అందుకు సిపిఐ సిద్దపడకపోవడం శోచనీయమని అన్నారు. ఎన్ని సార్లు ఫోన్లు చేసినా వారినుంచి స్పందనలేక పోవడం విచారకరమని అన్నారు .సాంబశివరావు లాంటి రాష్ట్ర నాయకుడు పిచ్చుక మీద బ్రహ్మస్త్రం లాగా సి ని టార్గెట్ చేయడం ఏమిటని మధు అన్నారు ? ఇప్పటికైనా తాము స్థానిక నాయకులతో కాకుండా సాంబశివరావు , హేమంతరావు లాంటి వారితో కలిసి కూర్చొని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు .

Leave a Reply

%d bloggers like this: