టీం ఇండియా ను వణికించిన బంగ్లా కుర్రాళ్ళు …187 పరుగులకు కట్టడి!

షకీబ్, ఇబాదత్ వికెట్ల వేట… టీమిండియా 186 ఆలౌట్!

  • టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య తొలి వన్డే
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్
  • 41.2 ఓవర్లకే అంతా అవుటైన వైనం
  • షకీబ్ కు 5 వికెట్లు, ఇబాదత్ కు 4 వికెట్లు
  • 73 పరుగులు చేసిన కేఎల్ రాహుల్

బంగ్లాదేశ్ తో తొలి వన్డేలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ విఫలమైంది. బంగ్లాదేశ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షకీబల్ హసన్ 5 వికెట్లతో టీమిండియా వెన్నువిరిచాడు. మరో ఎండ్ లో ఇబాదత్ హుస్సేన్ 4 వికెట్లతో విజృంభించడంతో భారత్ విలవిల్లాడింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ అయింది. 

కేఎల్ రాహుల్ అత్యధికంగా 73 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 27, శ్రేయాస్ అయ్యర్ 24 పరుగులు చేశారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (7) విఫలమయ్యాడు. 

షకీబ్ ఒకే ఓవర్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (9)లను పెవిలియన్ చేర్చడంతో టీమిండియా కోలుకోలేకపోయింది. వాషింగ్టన్ సుందర్ 19 పరుగులు చేసి షకీబ్ బౌలింగ్ లోనే అవుటయ్యాడు. మెహిదీ హసన్ కు ఒక వికెట్ దక్కింది.

Leave a Reply

%d bloggers like this: