Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకే దళిత బందు!

దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకే దళిత బందు
-పార్టీలకు అతీతంగా దళిత బందు
-అక్రమ వసూళ్లు చేస్తే పీడి యాక్టులు
-ఏ పార్టీ అయినా ఉపేక్షించేది లేదు
-ఇంటలిజెన్స్ ద్వారా ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం
-ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్

దళితుల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యంగా వారు ఆర్థికంగా బలపడాలన్న సదుద్దేశ్యంతో వారి ఆత్మగౌరవం పెంచేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ దళిత బందు పథకాన్ని ప్రవేశపెట్టారని ములుగు జడ్పీ చైర్మన్, ములుగు జిల్లా అధ్యక్షుడు , ములుగు నియోజక వర్గ ఇంచార్జీ కుసుమ జగదీశ్వర్ అన్నారు.ఈ మేరకు ఆయన దళిత బందు విషయంలో జరుగుతున్న అవకతవకల గురించి మీడియాతో ఫోన్ లో మాట్లాడారు. దళిత బందు పార్టీలకు అతీతంగా ప్రవేశపెట్టబడిందని కాంగ్రెస్ పార్టీ వారు పార్టీ ఫండ్ పేరుతో దళితుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని వారి పూర్తి సమాచారం ఇంటలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి చేరిందని, ఈ విధంగా దళిత బందును అపహాస్యం పాలు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడిన ఏ పార్టీ వారినైన ఉపేక్షించేది లేదని అటువంటి దళారుల సమాచారాన్ని పార్టీ శ్రేణులు సేకరించి తనకు అందజేయాలని ఎంతటి వారైన ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. విడుతల వారిగా కాంగ్రెస్ పార్టీ వారు వసూళ్ల పర్వం కొనసాగిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, పేరు నమోదు కార్యక్రమం నుంచి ఇడి ఆఫీసు నుండి ఫోన్ కాల్ వచ్చేంత వరకు ఈలోపే మొత్తం మాట్లాడుకున్న నగదును అప్పచెప్పే విధంగా దళారులు వ్యవహరిస్తున్న విషయం పరిగణలో ఉందని అన్నారు. విడతల వారిగా దళిత బందు లిస్టులో నమోదైన ప్రతి లబ్ది దారుని నుండి కాంగ్రెస్ పార్టీ వారు పేరు నమోదు కార్యక్రమంలో మొదట రూ. 20 వేల రూపాయల నుండి రూ. 2 లక్షల వరకు ముక్కు పిండీ వసూలు చేసిన సంఘటనలు కూడా తన దృష్టికి వచ్చాయన్నారు.

Related posts

రేణిగుంట చేరుకున్న అమిత్ షా… స్వయంగా స్వాగతం పలికిన సీఎం జగన్!

Drukpadam

గుడివాడలో కేసినో గొడవ …టీడీపీ వర్సెస్ వైసీపీ!

Drukpadam

లిక్కర్ స్కాం సూత్రధారి ,పాత్రధారి కవితే …ఆమె అరెస్ట్ ఖాయం …బీజేపీ నేత ప్రభాకర్ …

Drukpadam

Leave a Comment