Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం అభివృద్ధికి హ్యాట్సాఫ్ …

ఖమ్మం అభివృద్ధికి హ్యాట్సాఫ్ …నిజామాబాద్ అధికారులు ,ప్రజాప్రతినిధులు …
-మంత్రి పువ్వాడ  పై  ప్రశంశల జల్లు
-సీఎం కేసీఆర్ ఆదేశాలతో రెండు రోజుల పాటు ఖమ్మం లో పర్యటించిన కలెక్టర్,ఎమ్మెల్యే, మేయర్
-మంత్రి పువ్వాడ విజన్ అద్భుతం అంటున్న ప్రజాప్రతినిధులు
-ఖమ్మంను చూసి చాలా నేర్చుకున్నామన్న బృందం

తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే. స్వయానా ఖమ్మం అభివృద్ధి చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఖమ్మం విచ్చేసిన నిజామాబాద్ బృందం అభివృద్ధిని చూసి ఫిదా అయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేపట్టిన అభివృద్ధి ని చూసి ఫిదా అయ్యాం అని నిజామాబాద్ కలెక్టర్, ఎమ్మెల్యే,మేయర్ అన్నారు. ఖమ్మం మున్సిపాలిటీ ఇతమున్సిపాలిటీ లకు ఆదర్శంగా నిలిచింది.ఖమ్మం లో జరిగిన అభివృద్ధిని స్వయంగా పరిశీలించేందుకు నిజమాబాద్ మేయర్ దండు నీతు కిరణ్, ఎమ్మేల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ & మున్సిపల్ కమిషనర్ చిత్ర మిశ్రా,మున్సిపల్ DE లు, ప్రణాళిక,టౌన్ ప్లానింగ్,ఇంజనీరింగ్ తదితర విభాగాల అధికారులు ఖమ్మం వచ్చి స్వయంగా లకారం ను సందర్శించి అద్భుతమని కితాబులిచ్చారు.

పువ్వాడ అజయ్ కుమార్ ఎమ్మేల్యేగా ఎన్నికైన నుంచి అనతి కాలంలోనే మంత్రిగా తెరాస ప్రభుత్వం సహకారంతో ముఖ్యమంత్రి కేసీఅర్ నాయకత్వములో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో గడచిన మూడేళ్లలో ఖమ్మం అభివృద్దికి చిరునామాగా నిలిచింది.అభివృధ్ధి, సంక్షేమంపైనే ప్రత్యేక దృష్టి సారించి, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మంత్రి పువ్వాడకు ఖమ్మం ప్రజలు నీరాజనాలు పలుకుతారు.అభివృద్ది అంకెల్లో చివరి సంఖ్యగా ఉన్న ఖమ్మంను మొదటి వరుసలో నిలిపి ఇతర కార్పోరేషన్ లు చూసి నేర్చుకునే స్థాయికి ఎదిగి, ఇతర కార్పోరేషన్ లకు స్ఫూర్తిదాయకం నిలవటం ఖమ్మం చరిత్రలో ఇదో కలికితురాయి.

ఖమ్మం ఎంతలా అభివృద్ది చెందిందంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఅర్ స్వయంగా నిజమాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అభివృధ్ధి ప్రణాళిక స్థాయి సమావేశంలో ప్రస్తావించడం ఖమ్మం ప్రగతికి ప్రోగ్రెస్ రిపోర్ట్.ఒకప్పుడు ఆగం ఆగం గా ఉన్న ఖమ్మం నేడు చూడండి ఎంత అద్భుతంగా చేశారో.అన్న ముఖ్యమంత్రి కేసీఅర్ వ్యాఖ్యాలకు యావత్ సభ నివ్వెరపోయారంటే ఖమ్మం ఏ స్ధాయిలో ప్రగతి సాధించింది అవగతం అవుతుంది. అందుకు శక్తివంచన లేకుండా కృషి చేసిన మంత్రి పువ్వాడ ఆలోచనా విధానానికి సలాం కొట్టాల్సిందే.మన అభివృద్ధిని ఇతర జిల్లాలకు ఆదర్శంగా చూపడం ఖమ్మం నగర ప్రజలకు గర్వకారణం.మన అభివృద్ధిని స్వయంగా చూసేందుకు నిజామాబాద్ నుండి జిల్లా కలెక్టర్, వివిధ చైర్మన్ లు, ఎమ్మేల్యేలు, మున్సిపల్, ప్రణాళిక, టౌన్ ప్లానింగ్,ఇంజనీరింగ్ తదితర విభాగాల అధికారులు ఖమ్మం వచ్చి స్వయంగా లకారం,మినీ లకారం (వాకర్స్ పారడైస్), గొల్లపాడు ఛానల్ ప్రొఫెసర్ జయశంకర్ పార్క్,శ్రీ కాళోజి నారాయణ పార్క్,ఖానాపురం ఎన్ఎస్పి వాక్కువే, బల్లేపల్లి వైకుంఠధామం,పాండురంగాపురం బస్తి దవాఖాన, ఐటి హబ్, టి.ఎస్ ఆర్.టి.సి బస్టాండ్, ఇంటిగ్రేటెడ్

వెజ్ & నాన్ వెజ్ మార్కెట్, తెలంగాణకు హరితహారం భాగంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నర్సరీ లను సందర్శించి ఇప్పటి వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు అభివృద్ది పనులను స్వయంగా పరిశీలించారు.అభివృద్దిలో ఎక్కడో అట్టడుగున ఉన్న ఖమ్మంకు ఇంతటి కీర్తిప్రతిష్టలు దక్కడం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నగర ప్రజలు సర్వదా హర్షధ్వానాలు కురిపిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతం ,ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ ,నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ సురభి ,కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, గజ్జల లక్ష్మీ వెంకన్న,రుద్ర గాని శ్రీదేవి ఉపేందర్, మేడారపు వెంకటేశ్వర్లు, నాయకులు ఎల్లయ్య,మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మల్లేశ్వరి, పబ్లిక్ హెల్త్ ఈ ఈ రంజిత్, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు డి.ఈ లు రంగారావు,స్వరూప రాణి,ధరణి కుమార్,నవ్య జ్యోతి,ఏ.ఈలు సతీష్,కుమార్,మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

‘మమత బెనర్జీ’తో ‘సోషలిజం’కు వివాహం!

Drukpadam

చంద్రబాబుకు హైకోర్టులో ఊరట.. తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు

Ram Narayana

హోండురస్ మహిళా జైలులో మారణహోమం.. 41 మంది కాల్చివేత

Drukpadam

Leave a Comment