ఏపీలో పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు వాహనం సిద్ధం !

పవన్ కల్యాణ్ బస్సుయాత్రకు ‘వారాహి’ రెడీ… !

త్వరలో పవన్ బస్సు యాత్ర 
  • పవన్ కోసం ప్రత్యేకంగా బస్సుకు రూపకల్పన
  • నిర్మాణం పూర్తి చేసుకున్న బస్సుకు ట్రయల్ రన్
  • స్వయంగా పర్యవేక్షించిన పవన్ కల్యాణ్
త్వరలోనే జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. పవన్ వాస్తవానికి దసరా నుంచి బస్సు యాత్ర షురూ చేయాలని భావించినా, అది కార్యరూపం దాల్చలేదు. కాగా, పవన్ బస్సుయాత్రకు ఉపయోగించే భారీ వాహనం సిద్ధమైంది.
దీనికి సంబంధించిన ట్రయల్ రన్ వీడియో, ఫొటోలను పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ బస్సుకు ‘వారాహి’ అని పేరుపెట్టినట్టు పవన్ వెల్లడించారు. ఎన్నికల యుద్ధానికి ‘వారాహి’ సిద్ధమైంది అంటూ ఆయన ట్వీట్ చేశారు.కాగా, ఈ బస్సు ఆలివ్ రంగులో చూడ్డానికి మిలిటరీ వాహనంలా కనిపిస్తోంది. ఎంతో దృఢంగా కనిపిస్తున్న ఈ వాహనంలో పవన్ కు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు.
ఈ బస్సులో హై సెక్యూరిటీ సిస్టమ్ తో పాటు, జీపీఎస్ ట్రాకింగ్, 360 డిగ్రీల్లో రికార్డ్ చేయగల సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, రాత్రివేళల్లో సభల కోసం లైటింగ్ సిస్టమ్ ను పొందుపరిచారు. కాగా, ఈ వాహనం ట్రయల్ రన్ ను పవన్ స్వయంగా పర్యవేక్షించారు. వాహనాన్ని పరిశీలించారు.

Leave a Reply

%d bloggers like this: