Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్ట్ లకు అండగా ఉంటా…మంత్రి అజయ్!


 జర్నలిస్టులకు అండగా ఉంటా: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్!

– ప్రతి జర్నలిస్ట్ సంక్షేమమే పరమావధిగా ముందుకుసాగుతా: మంత్రి పువ్వాడ

– మంచి చేసే వారికి తోడుగా నిలవాలి: మంత్రి అజయ్

జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు.

ఖమ్మం లోని అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు ఇంటి జాగ ఇప్పించే బాధ్యత తనదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టమైన హామీ ఇచ్చారు. జర్నలిస్టు మరణిస్తే రూ.లక్ష ఇవ్వడంతోపాటు వారి కుటుంబానికి నెలకు మూడువేల పింఛన్‌, పిల్లల విద్య కోసం ఒక్కొక్కరికి వెయ్యి చొప్పున అదనంగా ఇచ్చే ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేస్తామని చెప్పారు.

జర్నలిస్టుల కొరకు గతంలో ఖమ్మం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరు చేసిందేమీ లేదని మంచి చేసిన వారికి జర్నలిస్టులు తోడుగా నిలవాలి అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.

”ఊపర్‌ షేర్వాణీ.. అందర్‌ పరేషానీ” ఇదీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సందర్భాల్లో రాష్ట్రంలోని జర్నలిస్టుల గురించి చెప్పే ముచ్చట అని జర్నలిస్టుల స్థితిగతులు తనకు తెలుసునని చెప్తూ, వారి బతుకులు బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వ్యక్తి కేసిఆర్ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమం మొదలు ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యాక కూడా కేసిఆర్ లో జర్నలిస్టు సమాజంపై ఉన్న మమకారం ఏ మాత్రం తగ్గలేదు అని రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జర్నలిస్టులకు ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేసి ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తి ఒక్క కేసీఆర్‌ మాత్రమేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

Related posts

పాత బస్ స్టాండ్ ఉద్యమం పై మంత్రి పువ్వాడ ఆగ్రహం…

Drukpadam

శ్రీశైలం వద్ద రోప్ వే… ప్రణాళికలు సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం!

Drukpadam

పాలనలో వైఎస్ జగన్ సర్కారుకు మరోసారి నెంబర్ 1 ర్యాంకు

Drukpadam

Leave a Comment