రాజ్యసభ చైర్మన్ ప్యానల్ నుంచి విజయసాయి అవుట్ …

రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ నుంచి విజయసాయిరెడ్డి పేరు తొలగింపు!

  • నిన్న విజయసాయి సహా రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ ప్రకటన
  • 8 మందికి స్థానం.. నేడు ఏడుగురి పేర్లే చదివిన రాజ్యసభ చైర్మన్
  • విజయసాయిని తొలగించినట్టు వెల్లడి

నిన్న రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ కు ఎంపికైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి నేడు ఊహించని పరిణామం ఎదురైంది. విజయసాయిని వైస్ చైర్మన్ ప్యానెల్ నుంచి తప్పిస్తూ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కడ్ నిర్ణయం తీసుకున్నారు.

నిన్న మొత్తం 8 మందితో రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ ను ప్రకటించారు. అయితే, నేడు రాజ్యసభలో ప్యానెల్ సభ్యుల జాబితాను వెల్లడించే క్రమంలో ఏడు పేర్లే చదివారు. అందులో విజయసాయి పేరు లేదు. ఆయనను వైస్ చైర్మన్ ప్యానెల్ నుంచి తొలగించినట్టు రాజ్యసభ చైర్మన్ వెల్లడించారు.

విజయసాయి పేరు తొలగింపునకు గల కారణాలు వెల్లడి కాలేదు. కాగా, రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్లో డాక్టర్ ఎల్. హనుమంతయ్య, భుభనేశ్వర్ కలిటా, సురేంద్ర సింగ్ నాగర్, తిరుచ్చి శివ, సుఖేందు శేఖర్ రే, డాక్టర్ సస్మిత్ పాత్రా, సరోజ్ పాండే సభ్యులుగా కొనసాగుతారు.

Leave a Reply

%d bloggers like this: