దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు హిమాచల్ ఎన్నిక అద్దం పడుతుంది…భట్టి

హిమాచల్ ఎన్నిక దేశ రాజకీయ పరిస్థితులకు అద్దంపడుతుంది :సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క …
కాంగ్రెస్ పట్టం కట్టిన హిమాచల్ ప్రజలకు అభినందనలు
మోడీ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు చెంపపెట్టు
బీజేపీ తప్పుడు ప్రచారం వల్లనే గుజరాత్ లో ఓటమి
ఎంఐఎం , ఆప్ వల్లనే బీజేపీ గెలిచింది
ఆ పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

హిమాచల్ ప్రదేశ్లో మంచి మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించడం దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు .హిమాచల్ , గుజరాత్ ఎన్నికకాల ఫలితాల అనంతరం హైద్రాబాద్ లోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ దేశంలో ఇటీవల జరిగిన పరిణామాలు బీజేపీ పట్ల ప్రజల్లో రగులుతున్న అసంతృప్తికి నిదర్శనంగా అభివర్ణించారు .ఇక బీజేపీ డౌన్ పాల్ మొదలైందని,కాంగ్రెస్ కు మంచి రోజులు రానున్నాయన్నారు .

మోడీ చేస్తున్న ఆకృత్యాలు, ఆరచకాలను సహించలేని హిమచల్ ప్రదేశ్ ప్రజలు బిజెపిని ఓడించి కాంగ్రెస్ కు పట్టం కట్టారని అన్నారు .గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలున్నప్పటికీ ప్రధాని గల్లీ నాయకుడులాగ తిరిగారని , అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని విమర్శలు గుప్పించారు .దీనికి తోడు ఎంఐఎం , ఆప్ లు బీజేపీకి ఉపయోగపడేలా పోటీలో నిలిచి కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీశాయని ధ్వజమెత్తారు . ఆప్, బీజేపీ మధ్యే పోటీ ఉన్నట్లుగా మీడియా లో బిజెపిలో ప్రచారం చేయించారని అన్నారు . డబ్బు, అధికారం, మీడియాలో తప్పుడు ప్రచారం బీజేపీకి అధికారం దిశగా తీసుకోని పోయాయని ఆరోపించారు .బీజేపీపై నమ్మకంతో గుజరాతీలు ఓట్లు వేసినట్లుగా కనిపించడం లేదన్నారు

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధి చేపట్టిన భారత్జోడో యాత్ర ఎన్నికల కు ఎలాంటి సంబంధం లేదని ,గుజరాత్ ఓటమికి ఖర్గే భాద్యుడు కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు .

కాంగ్రెస్ పార్టీలో కమిటీల నియామకంపై కసరత్తు జరుగుతుంది. కమిటీల ఏర్పాటుపై తన అభిప్రాయం కూడా చెప్పినట్లు తెలిపారు .
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా పార్టీలోనే ఉన్నారు. క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నారని తెలిపారు .

సమైక్య రాష్ట్రం నినాదంపై సజ్జల రామకృష్ణ చేసిన కామెంట్స్ ఆయన వ్యక్తిగతం మని పేర్కొన్న భట్టి తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోరుకున్నారు కాబట్టే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని అన్నారు .

సమైక్య నినాదం ఇవ్వాళ కొత్త కాదు. రాష్ట్ర విజభన జరిగినప్పుడు కూడా వాళ్ళు అదే కదా అన్నారు. రాజకీయాల్లో నిరంతరం కన్ఫ్యూజన్ నడుస్తూనే ఉంటాయన్నారు . మళ్ళీ సెంటిమెంట్ రగిలించే కుట్రలో భాగమే సజ్జల కామెంట్స్ గా ఉన్నాయని అభిప్రాయపడ్డారు . మళ్ళీ సమైక్య రాష్ట్ర నినాదం అనే వాదనతో ఉపయోగం లేదు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకమని భట్టి స్పష్టం చేశారు .గుజరాత్ లో గెలుపు స్పూర్తితో తెలంగాణలో గెలుస్తామని బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాక్యాలు హాస్యస్పదంగా ఉన్నాయని భట్టి అన్నారు .

 

Leave a Reply

%d bloggers like this: