హిమాచల్ ప్రదేశ్ లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్!

హిమాచల్ ప్రదేశ్ లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్
హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లో ఓట్ల లెక్కింపు
హిమాచల్ అసెంబ్లీలో మొత్తం 68 సీట్లు
మ్యాజిక్ ఫిగర్ 35
ఇప్పటికే 36 స్థానాల్లో నెగ్గిన కాంగ్రెస్
మరో నాలుగు చోట్ల ఆధిక్యం
గుజరాత్ లో బీజేపీ జోరు

హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఆవిరయ్యాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను కాంగ్రెస్ పార్టీ దాటేసింది.

హిమాచల్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలు ఉండగా, 35 స్థానాలు గెలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ 36 స్థానాల్లో గెలిచి మరో 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 23 స్థానాల్లో గెలిచి మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ హిమాచల్ ప్రదేశ్ లో బోణీయే చేయలేకపోయింది. ఇతరులు మూడు ఓట్ల గెలిచారు.

అటు, గుజరాత్ ఓట్ల లెక్కింపులో అధికార బీజేపీ హవా కొనసాగుతోంది. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి ఇటీవల రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. నేడు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి బీజేపీ 131 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. మరో 25 స్థానాల్లో గెలుపు దిశగా పరుగులు తీస్తోంది.

కాంగ్రెస్ మరీ దారుణంగా 10 స్థానాల్లో గెలిచి, 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభంజనం సృష్టిస్తామని చెప్పిన ఆప్ 2 స్థానాల్లో నెగ్గి, 3 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇతరులు 4 చోట్ల గెలిచారు.

Leave a Reply

%d bloggers like this: