Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల బీజేపీ వదిలిన బాణమే…తమ్మినేని…

షర్మిల బీజేపీ వదిలిన బాణమే…తమ్మినేని…
-బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఘర్షణతో ప్రజాసమస్యలు పక్కదారి
-పోడుభూముల సర్వే లో లోపాలు ఉన్నాయి
-గొత్తికోయలను వెళ్ళగొట్టాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధం
-జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై రాష్ట్ర వ్యాపిత ఉద్యమం

బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఘర్షణల కారణంగా రాష్ట్రంలో ప్రజాసమస్యలు పక్కదోవ పడుతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం సిపిఎం ఖమ్మం జిల్లా కార్యాలయం సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పార్టీ జాతీయ నాయకులతో కలిసి పాల్గొన్న సందర్భంగా రాష్ట్ర సమస్యలపై మాట్లాడారు . షర్మిల బీజేపీ వదిలిన బాణమేనని సంచలన ఆరోపణ చేశారు .ఇటీవల షర్మిల అరెస్ట్ అయిన సందర్భంగా స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి పరామర్శించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు .  తప్పుచేసిన వారిని శిక్షించడాన్ని సీపీఐ(ఎం) ఎక్కడా తప్పుపట్టదని, విచారణ జరగకుండానే దోషులని ఆరోపణలు చేస్తూ తిట్టిపోసుకోవడమే పనిగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ల తీరుందని ధ్వజమెత్తారు. కేంద్ర నిఘాసంస్థలను ప్రతిపక్షాలపైనే కేంద్రీకరణ చేయడం చూస్తే బీజేపీ తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలనే దుర్భుద్దిని వెల్లడిస్తుందన్నారు. పార్టీల ఫిరాయింపుల కోసం ఓ బాధ్యుడినే కేటాయించడం హాస్యాస్పదమన్నారు. ఒకటి, రెండు ఎన్నికల్లో కొన్నిస్థానాల్లో గెలిచినంత మాత్రాన తమే అధికారంలోకి వస్తామనుకోవడం బీజేపీ అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఫ్యూడలిజాన్ని పారదోలి సెక్యులరిజాన్ని ప్రతిష్టించిన చరిత్ర తెలంగాణ ప్రజానీకనిదని స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశాలతో ప్రజాసమస్యలు పక్కదోవ పడుతున్నాయన్నారు. బీజేపీ నాటకాలు, డ్రామాలు ప్రజలు అర్థం చేసుకోలేరని స్థితిలో లేరన్నారు. షర్మిల బీజేపీ వదిలిన బాణమే అని అర్థమవుతుందన్నారు. దక్షిణ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర సర్కారు సైతం వెనుకబడిరదన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్రాజెక్టులకు జాతీయ హోదా, కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ వంటివేవి కేంద్రం ఆచరణలో పెట్టలేదన్నారు. పోడుభూములు, అసంఘటిత రంగ కార్మికులు, ధరణి సమస్యలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని పరిష్కారం దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. పోడు సర్వేల్లో లోపాలున్నాయని 36ఏళ్లుగా నివాసం, సొంత భూమిని పరిగణలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. గుత్తికోయలను రాష్ట్రం నుంచి వెళ్లాగొట్టాలనడం సర్వేలో వారిని పరిగణలోకి తీసుకోకపోవడం చట్టవిరుద్ధమన్నారు. దళిత బంధుతో పాటు ముస్లిం, బీసీ బంధు వంటి డిమాండ్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో వాటిని సైతం అమలుచేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కోర్టు తీర్పు ఇచ్చినా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఇటీవల జర్నలిస్టుల సమస్యల పై తమ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఆందోళన నిర్వహించమన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనలను కొనసాగిస్తామన్నారు. రాబోయే కాలంలో జరిగే పోరాటాలకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జాతీయ నాయకులు ఎన్‌. చంద్రన్‌, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట్‌, పోతినేని సుదర్శన్‌, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, బొంతు రాంబాబు, కల్యాణం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Related posts

షర్మిల ఖమ్మం టూర్ లో గిరిజనులతో ముఖాముఖీ

Drukpadam

కేసీఆర్ కు ఇక అధికారం కలే …కొత్తగూడెం సభలో పొంగులేటి , జూపల్లి …!

Drukpadam

చిరంజీవి పై అన్న మాటలకు పశ్చాత్తాపం ప్రకటించిన సిపిఐ నారాయణ!

Drukpadam

Leave a Comment