Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

భారత రాజకీయాల్లో మరో కొత్త జాతీయపార్టీ ..బీఆర్ యస్!

భారత రాజకీయాల్లో మరో కొత్త జాతీయపార్టీ ..బీఆర్ యస్!
-భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావం.. రైతు రాజ్యం ఏర్పాటు చేస్తామంటున్న కేసీఆర్
-టీఆర్ఎస్ జెండాకు, బీఆర్ఎస్ జెండాకు మధ్య ఉన్న తేడాలు ఇవే!
-ఈసీ లేఖపై సంతకం చేసిన కేసీఆర్
-తెలంగాణ పటం స్థానంలో భారతదేశ చిత్రపటం
-జై తెలంగాణకు బదులుగా జై భారత్ నినాదం
-కార్యక్రమానికి హాజరైన కుమారస్వామి, ప్రకాశ్ రాజ్

భారత రాజకీయాల్లో మరో కొత్తపార్టీ బీఆర్ యస్ ఆవిర్భావం జరిగింది. కేసీఆర్ ఆధ్వరంలో ఏర్పాటు అయినా ఈ జాతీయపార్టీకి ఇసి ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు టీఆర్ యస్ గా ఉన్న పార్టీ స్థానంలో బీఆర్ యస్ వచ్చింది. అధికారికంగా కేసీఆర్ కు బీఆర్ యస్ పార్టీని గుర్తిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలపటంతో టీఆర్ యస్ భవనంలో సంబరాలు జరిగాయి . ముహూర్తం ప్రకారం బీఆర్ యస్ జెండాను గులాబీ బాస్ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు . ఈ కార్యక్రమంలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి , ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ లతో పాటు పలువురు తెలంగాణ మంత్రులు , ఎంపీలు , ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు జిల్లా పార్టీల అధ్యక్షలు , పాల్గొన్నారు .

బీఆర్ యస్ ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో రైతు రాజ్యం ఏర్పాటు చేయడమే తమ లక్ష్యం అని అన్నారు . ఈ నెల 14 న ఢిల్లీలో బీఆర్ యస్ కార్యాలయం ప్రారంభిస్తామని అన్నారు . కొత్త కార్యాలయాన్ని ఏప్రిల్ లో ఏర్పాటు చేస్తామని చెప్పారు . పార్టీ జాతీయ విధానాన్ని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు . దేశానికి కొత్త ఆర్థిక విధానం కావాలని , కిసాన్ సర్కార్ ఏర్పాటు కావాలని అందుకు ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు కానీ పార్టీలు కాదని కేసీఆర్ స్పష్టం చేశారు . దేశంలో మార్పు కోసమే బీఆర్ యస్ ఏర్పాటు జరిగిందని రేపు ఎర్రకోట పై ఎగరబోయేది గులాబీ జెండానేనని అన్నారు .

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. ఈ మధ్యాహ్నం సరిగ్గా ముహూర్త సమయమైన 1.20 నిమిషాలకు ఈసీ లేఖపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సంతకం చేశారు. బీఆర్ఎస్ జెండాను ఆయన ఆవిష్కరించారు. జెండాలో తెలంగాణ పటం స్థానంలో భారతదేశ చిత్రపటాన్ని ఉంచారు. జై తెలంగాణకు బదులుగా జై భారత్ అని పేర్కొన్నారు. జెండాలో కారు గుర్తు కనిపించలేదు.

మరోవైపు ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు వీరితో పాటు టీఆర్ఎస్ నేతలు అభినందనలు తెలిపారు. ఈ క్షణం నుంచి తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ కనుమరుగు కానుంది. బీఆర్ఎస్ ఏర్పాటుతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

Related posts

18 ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు వీరే!

Drukpadam

దోపిడీ పీడన ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుంది..సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని…

Drukpadam

ఏపీ ప్ర‌భుత్వంపై తెలంగాణ మంత్రి ఘాటు వ్యాఖ్య‌లు!

Drukpadam

Leave a Comment