నవీన్ రెడ్డి మాటలు నమ్మొద్దు… అతడిని నేను పెళ్లి చేసుకోలేదు: వైశాలి!
నవీన్ రెడ్డి మాటలు నమ్మొద్దు… అతడిని నేను పెళ్లి చేసుకోలేదు: వైశాలి!
- రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో కిడ్నాప్ కలకలం
- వైశాలి అనే అమ్మాయిని లాక్కెళ్లిన నవీన్ రెడ్డి
- వైశాలి ఇంటిపై దాడి, అనుచరులతో వీరంగం
- తాను వైశాలిని పెళ్లి చేసుకున్నట్టు నవీన్ రెడ్డి వెల్లడి
- ఖండించిన వైశాలి
అతడితో తనకు బ్యాడ్మింటన్ ఆడే సమయంలో పరిచయం జరిగిందని, పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడని, తాను అందుకు ఇష్టపడలేదని వివరించింది. ఫ్యామిలీ ఫ్రెండ్ బుచ్చిరెడ్డి ద్వారా తన కుటుంబాన్ని సంప్రదించాడని తెలిపింది. అయితే, అతడిని తమ ఇంట్లోని వారు ఇష్టపడలేదని వైశాలి వెల్లడించింది.
పెళ్లి చేసుకోకుంటే తన జీవితం నాశనం చేస్తానని బెదిరించాడని, నిన్న తమ ఇంటిపై దాడి చేసి బలవంతంగా లాక్కెళ్లారని వివరించారు. కారులో తీసుకెళుతూ తనను నవీన్ రెడ్డి తీవ్రంగా కొట్టాడని, తాను చెప్పినట్లు వినకపోతే తన తండ్రిని చంపేస్తామని బెదిరించారని వైశాలి ఆరోపించింది.
తల్లిదండ్రులు కూడా తనపై ఎప్పుడూ చేయిచేసుకోలేదని, కానీ నవీన్ రెడ్డి తనను దారుణంగా కొట్టాడని గాయాల తాలూకు గుర్తులను వైశాలి మీడియాకు ప్రదర్శించింది. నీ ఇష్టంతో నాకు పనిలేదు… నువ్వంటే నాకు ఇష్టం… నువ్వు ఇంకెవర్నీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని బెదిరించాడని వివరించింది. గతంలో తన పేరిట అతడు ఇన్ స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేశాడని తెలిపింది.