Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తిరుమల కొండపై ఎడతెరిపి లేని వర్షం… శ్రీవారి మెట్టు మార్గంపై భారీగా వరద నీరు!

తిరుమల కొండపై ఎడతెరిపి లేని వర్షం… శ్రీవారి మెట్టు మార్గంపై భారీగా వరద నీరు!

  • మాండూస్ తుపానుతో దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు
  • తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు
  • తిరుమల కొండపై జోరు వానలు
  • చెట్టు కూలి భక్తురాలికి గాయాలు
  • అప్రమత్తమైన టీటీడీ

మాండూస్ తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో దర్శనం అనంతరం భక్తులు కొండ నుంచి తిరుగు పయనమవుతున్నారు.

కాగా, తిరుమలలో ఓ భారీ వృక్షం కూలిపోయి భక్తురాలికి గాయాలయ్యాయి. అటు శ్రీవారి మెట్టు మార్గంలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో, టీటీడీ అప్రమత్తం అయింది.

కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో భక్తుల రాకపోకలు నిలిపివేసింది. శ్రీవారి మెట్టు మార్గంపై నడిచి వెళ్లే భక్తులను అనుమతించడంలేదు. పాపనాశనం, శిలాతోరణం మార్గాలను మూసివేసింది. తిరుమలలోని అన్ని జలాశయాల్లో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది.

Related posts

ఇవ‌న్నీ నువ్వు నేర్పినవే నాన్నా!: వైఎస్ జ‌గ‌న్

Drukpadam

11 ఏళ్ల క్రితం చనిపోయిందనుకున్న తెలంగాణ మహిళ తమిళనాడులో ప్రత్యక్షం!

Drukpadam

Why Bold Socks Are The ‘Gateway Drug’ To Better Men’s Fashion

Drukpadam

Leave a Comment