Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రవాణా రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి …మంత్రి అజయ్!

రవాణా రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి …మంత్రి అజయ్!
-పెరిగిన వాహనాలు …ఆదాయం
-కేసీఆర్ విజన్ నే కారణమంటున్న మంత్రి అజయ్
-2014 లో రాష్ట్రంలో వాహనాల సంఖ్య 71 లక్షల 70 వేల 998
-2022 నాటికీ వాహనాల సంఖ్యా కోటి 51 లక్షల 62 వేల 724 పెరిగాయి
-తెలంగాణ వైపు దేశం చూపు …బీఆర్ యస్ కు పెరగనున్న ఆదరణ

తెలంగాణ రాష్ట్రంలో రవాణారంగం అద్భుత ప్రగతి సాధించిందని రాష్ట్రరవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు . ఖమ్మం ఎమ్మెల్యేగా ,మంత్రిగా కేసీఆర్ అప్పగించిన భాద్యతలు నిర్వహించినందుకు గర్వపడుతున్నానని అన్నారు . రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై నాలుగు సంవత్సరాలైనా సందర్భంగా తనను కలిసిన విలేకర్లతో చిట్ చాట్ నిర్వహించారు . ఇదంతా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోనే సాధ్యమైందని పేర్కొన్నారు .

రాష్ట్ర రవాణా రంగంలో ఆర్టీసీ కీలకంగా మారిందని బస్సు లసంఖ్యం ,ఆక్యుపెన్సీ రేటు, ఆదాయం పెరిగిందని మంత్రి వివరించారు . కేసీఆర్ రెండవసారి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తి అయిందని దేశంలోనే తెలంగాణ అభివృద్ధి సంక్షేమ రంగాల్లో నంబర్ వన్ గా నిలిచిందని అన్నారు . రాష్ట్రం ఏర్పడిననాడు 71 లక్షల 71 వేలు గా ఉన్న వాహనాల సంఖ్య 8 సంవత్సరాల కాలంలో కోటి 51 లక్షల 62 వేల 724 కు పెరిగాయని ఇది రాష్ట్ర పురోభివృద్ధికి మచ్చుతునక మాత్రమేనని మంత్రి అన్నారు .

పెరుగుతున్న వాహనాలు జనాభాకు తగ్గట్లుగా మౌలిక అవసరాలు పెంచుకోవడం జరిగిందని అన్నారు . రోడ్లు , నేషనల్ హైవేస్ సింగిల్ రోడ్స్ ను డబల్ రోడ్స్ గా మార్చటం , నాలుగు లైన్ల రోడ్స్ ఏర్పాటు ,గ్రామాలకు , మండలాలకు ,జిల్లాలకు ,అనుసంధానం చేయడం జరిగిందని పేర్కొన్నారు . ఇది అభివృద్ధిలో విప్లవాత్మక మార్పు అని అతి కొద్దీ కాలంలోనే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టడం అభినందనీయమన్నారు . ఇందుకు కేసీఆర్ విజన్ నే కారణమని మంత్రి పేర్కొన్నారు . ఖమ్మం లాంటి జిల్లా కేంద్రంలో రాజధాని స్థాయిలో బస్సు స్టేషన్ ఏర్పాటు చేయడం అది తన హయాంలో జరగడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు . మరికొన్ని జిల్లాల్లో కూడా బస్సు స్టేషన్లు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామని అన్నారు .

రాష్ట్రంలో 2014 నాటికీ 8 లక్షల కార్లు , నాలుగు చక్రాల వాహనాలు , బస్సు లు ,ఉంటె ఇప్పుడు ఆసంఖ్య 111 శాతం అంటే 19 లక్షల 51 వేల 992 లకు పెరిగాయని అన్నారు .అదే విధంగా ట్రాక్టర్లు , ట్రాలీలు 2 లక్షల 69 వేల 753 నుంచి 6 లక్షల 82 వేల 932 లకు పెరిగాయని వివరించారు . టు వీలర్స్ 53 లక్షలు 23 వేల 498 ఉండగా 2022 నాటికీ వాటిసంఖ్య కోటి 11 లక్షల 88 వేల 996 లకు పెరిగాయని మంత్రి అన్నారు .

 

బిల్డింగ్స్ 30 లక్షల 43 వేల చదరపు అడుగులు ఉండగా ,ఇప్పుడు కోటి 32 లక్షల 45 వేల పెరిగిన విషయాన్నీ గుర్తు చేశారు . నేషనల్ హైవేస్ 98 శాతం అంటే 2500 కి ,మీ నుంచి 5 వేల కి .మీ పెంచుకోవడం జరిగిందని అన్నారు .

దీంతోపాటు రైతు బంధు , ఉచిత విద్యత్ ,కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ , సీఎం రిలీఫ్ ఫండ్ , పెన్షన్లు , మిషన్ భగీరథ , మిషన్ కాకతీయ లాంటి పథకాలకు తోడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక నిధుల విడుదల తో బంగారు తెలంగాణ సాకారం దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి అజయ్ అన్నారు .

కేసీఆర్ పథకాలు దేశమంతా కోరుకుంటుంది.

కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షమే పథకాలు దేశమంతా కోరుకుందని అందువల్లనే దేశమంతా తెలంగాణ లాంటి అభివృద్ధి కావాలని ఎదురు చూస్తున్నారని అన్నారు.అందులో భాగంగానే టీఆర్ యస్ పార్టీని బీఆర్ యస్ గా మార్చడం జరిగిందని మంత్రి అన్నారు.కేసీఆర్ ఏది చేసినా ముందుచూపుతోనే ప్రజల మేలుకోసం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు .

Related posts

తొలి పది’లో ఆరుగురు బాలురే!

Drukpadam

‘లఖింపూర్ ఖేరీ’ ఘటన విషయంలో యూపీ ప్రభుత్వంపై సీజేఐ రమణ మండిపాటు!

Drukpadam

అయోధ్య రామమందిరంలో భక్తుల దర్శనాలకు ముహూర్తం నిర్ణయించిన ఆలయ ట్రస్టు!

Drukpadam

Leave a Comment