తండ్రి క్యాబినెట్ లో మంత్రి కాబోతున్న ఉదయనిధి …?

తండ్రి క్యాబినెట్ లో మంత్రి కాబోతున్న తమిళ సినీ హీరో!

  • తమిళనాడులో రేపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
  •  సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధికి పదవి వస్తుందని ప్రచారం
  • ప్రస్తుతం డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా ఉదయనిధి

తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ మంత్రి పదవి చేపట్టే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఎమ్యెల్యేగా ఎన్నికైన ఆయన తన తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ క్యాబినెట్ లో మంత్రి అవుతాడన్న ప్రచారం జోరందుకుంది. తమిళనాడులో బుధవారం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఉదయనిధి ప్రస్తుతం డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా పని చేస్తున్నారు.

ఇక తనకు మంత్రి పదవి లభిస్తుందనే వార్తలపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. ఈ వార్తలను ఆయన ధ్రువీకరించలేదు. అదే సమయంలో ఖండించనూలేదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని, దానిపై తాను వ్యాఖ్యానించలేను అని చెప్పారు.

అయితే, క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఉదయనిధికి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని డీఎంకేలోని ప్రముఖ వర్గాలు పేర్కొంటున్నాయి. బుధవారం జరగనున్న సీఎం స్టాలిన్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఉదయనిధికి క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ఇవ్వనున్నట్లు తెలిపాయి. మెయ్యనాథన్ శివ ప్రస్తుతం క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. క్యాబినెట్లో మార్పుల తర్వాత పలువురు మంత్రుల శాఖలు మారనున్నాయి.

Leave a Reply

%d bloggers like this: