Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లలో ఆగ్రహజ్వాలలు…సీఎల్పీ నేతను కలిసిన సీనియర్లు …

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లలో ఆగ్రహజ్వాలలు…!
-సీనియర్ల భేటీ … కమిటీల ఏర్పాటుపై కస్సుబుస్సు
-సీఎల్పీ నేతను కలిసిన సీనియర్లు …
-తనకు టీపీసీసీ అధ్యక్షుడికి సమాన అధికారాలు ఉన్నాయన్న భట్టి
-అయినా కమిటీ నియామకంలో తనకు ఏమి తెలియదన్న భట్టి
-ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకోని పోయి పరిష్కరిస్తామన్న భట్టి ..
-ఇప్పటికే కొండా సురేఖ లాంటివారు కమిటీలకు రాజీనామా !
-పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చాలన్న విహెచ్

తెలంగాణ రాష్ట్రంలో నెత్తిమీదికి ఎన్నికలు వస్తున్నాయి…కానీ కాంగ్రెస్ లో గ్రూపులుపడి కొట్టుకుంటున్నారు . అధికారంలోకి మేమె వస్తామని దైర్యంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ పొరపాటుగా ప్రజలు ఓటు వేసిన గెలిచినా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఉంటారనే గ్యారంటీ లేదు . పార్టీ నిర్వీర్యం అవుతున్న ఒక్కక్కరుగా పార్టీని వీడుతున్నా పార్టీ నేతలకు చీమకుట్టినట్లుగా కూడా లేదు . తమకు పదవులు కావాలి అంటారు కానీ గెలిపించే సత్తా ఉండదు . పైగా పార్టీలో సఖ్యత లేకపోగా రోజురోజుకు దూరం పెరిగిపోతుంది.

నిన్న టీపీసీసీ కమిటీతోపాటు , పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు పార్టీలోని సీనియర్ల ఆగ్రహానికి కారణమైంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ లో సీనియర్ల , జూనియర్లలేదా కొత్తగా వచ్చిన వారికీ మధ్య జరుగుతున్న పోరు పార్టీని మరింత దిగజార్చే దిశగా తీసుకోని పోతున్నదనే విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. అయినప్పటికీ పార్టీలో ఏమాత్రం మార్పు లేదు . కొండా సురేఖ ను కేవలం కార్యవర్గంలోకి మాత్రమే తీసుకోవడంపై ఆమె పార్టీ కమిటీకి రాజినామా చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు . వార్డ్ కు కూడా గెలవలేని , గెలిపించలేని మరికొందరు పార్టీకి నష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని అభిప్రాయాలూ ఉన్నాయి. విహెచ్ లాంటి వారు ఇన్ని కమిటీలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు . దీంతో సీనీర్లందరూ హైద్రాబాద్ లో భేటీ అయి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ను కలిసి కమిటీల ఏర్పాటు వాటిలో సీనియర్లకు స్తానం లేకపోవడంపై ఫిర్యాదు చేశారు .సీఎల్పీ నేతగా తనకు టీపీసీసీ అధ్యక్షుడితో సమాన అధికారాలు ఉన్నప్పటికీ కమిటీల ఏర్పాటు తనకు తెలియకుండానే వేశారని వాపోయారు . సీనియర్ల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకోని పోతానని అందరికి న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు .

సంవత్సర కాలం క్రితం టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం పార్టీలోని విభేదాలకు ఆజ్యం పోసినట్లు అయింది. అప్పటివరకు టీపీసీసీ పదవి కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి , శ్రీధర్ బాబు ,మధు యాష్కీ లాంటి పేర్లు వినిపించగా కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి పదవి ఇవ్వడంపై విభేదాలు బజారుకెక్కాయి. అయినప్పటికీ అధిష్టానం పార్టీలో సీనియర్ల అభిప్రాయాలూ ఏమాత్రం ఖతార్ చేయకుండా రేవంత్ వైపు ముగ్గుచూపడంపై విమర్శలు వచ్చాయి .చివరికి తెలంగాణ పార్టీ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ రేవంత్ దగ్గర డబ్బులు తీసుకోని టీపీసీసీ అమ్ముకున్నారని ఆపదవికోసం చివరివరకు ప్రయత్నం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణలు గుప్పించారు .

 

పీసీసీ కమిటీలపై నాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదో తెలియదు: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka opines on PCC Committees

ఇటీవల కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ పీసీసీ కమిటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలపై తెలంగాణలో అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా, తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు.  

పీసీసీ కమిటీల్లో సీనియర్ల పేర్లు లేవని, సామాజిక సమతుల్యత లోపించిందని కొందరు తనతో చెప్పారని భట్టి వెల్లడించారు. తన దృష్టికి వచ్చిన అంశాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని తెలిపారు. పీసీసీ కమిటీల రూపకల్పనలో సీఎల్పీ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారని, కానీ తనకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదో తెలియదని అన్నారు. జిల్లాల వారీగా నేతల ఎంపికలో పీసీసీతో పాటు సీఎల్పీకి కూడా సమాన బాధ్యత ఉంటుందని భట్టి పేర్కొన్నారు. 

భట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, కోదండరెడ్డి, గీతారెడ్డి, మధుయాష్కీ గౌడ్, మహేశ్వర్ రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలతో పాటు పీసీసీ కమిటీలపైనా ఈ భేటీలో చర్చించామని భట్టి వెల్లడించారు.

Related posts

శ్రీనివాస్ గౌడ్ హ‌త్య‌కు కుట్ర‌.. జితేంద‌ర్‌రెడ్డి, డీకే అరుణ‌ల పాత్ర‌పై విచార‌ణ‌…

Drukpadam

యువతిని కొడుతూ నగ్నంగా ఊరేగించిన భర్త, అత్తమామలు

Ram Narayana

అమెరికా వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్‌తో దూసుకెళ్లిన తెలుగు యువకుడికి శిక్ష !

Drukpadam

Leave a Comment