ఢిల్లీలోబీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీల తొలగింపు!

ఢిల్లీలోబీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీల తొలగింపు!

రేపు ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభం

ఈరోజు, రేపు యాగాలను నిర్వహించనున్న కేసీఆర్

ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన పార్టీ శ్రేణులు

బీఆర్ఎస్ గా అవతరించిన టీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమయింది. ఈ నెల 14న ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ప్రారంభం కానుంది. ఇందుకోసం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు ఈరోజు, రేపు పార్టీ కార్యాలయంలో రాజశ్యామల, నవచండీ యాగాల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.

ఈ నేపథ్యంలో పలుచోట్ల బీఆర్ఎస్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దేశ్ కీ నేతా కేసీఆర్ అంటూ ఫ్లెక్సీలపై ముద్రించారు. అయితే, ఈ ఫ్లెక్సీలను ఎన్డీఎంసీ (న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్) అధికారులు తొలగించారు. అనుమతి లేకుండానే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని, అందుకే వాటిని తొలగించామని అధికారులు వెల్లడించారు. మరోవైపు, కాసేపట్లో రాజశ్యామల యాగం ప్రారంభంకానుంది.

Leave a Reply

%d bloggers like this: