ఆసక్తికరంగా మారిన వివిధ పార్టీల్లో ఉన్న కాపునేతల భేటీ ….
ఆసక్తికరంగా మారిన వివిధ పార్టీల్లో ఉన్న కాపునేతల భేటీ ….
–వీరు కలవడంపై గంటా శ్రీనివాసరావు వివరణ
–ఒక వివాహం కోసం విజయవాడకు వచ్చిన గంటా
–వివాహానంతరం గంటా నివాసంలో కాపు నేతల భేటీ
–హాజరైన కన్నా లక్ష్మీనారాయణ, బొండా ఉమ
మాజీమంత్రి వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహనం సందర్భంగా విజయవాడ వచ్చిన కాపునేతలు మాజీమంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా నివాసంలో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది . కాపు గర్జన జరుగుతున్న నేపథ్యంలో ఇది చర్చనీయాంశం అయింది.గంటా పార్టీ మారుతున్నారంటూ వసున్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడంలేదని మారితే ముందుగానే చెపుతానని వెల్లడించారు . అయితే బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తో భేటీ పై కూడా రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారుతున్నాననే వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. ఒకవేళ పార్టీ మారితే ఆ విషయాన్ని తానే అందరికీ చెపుతానని అన్నారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణను కలవడం వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు. వెల్లంపల్లి కుమార్తె పెళ్లి సందర్భంగా కలుసుకోవడం జరిగిందని తెలిపారు. వంగవీటి రంగా వర్ధంతి అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు.
మరోవైపు, నిన్న రాత్రి విజయవాడలోని తన నివాసంలో కాపు సామాజికవర్గ నేతలు భేటీ అయ్యారు. విజయవాడలో వివాహ కార్యక్రమానికి గంటా వచ్చారు. వివాహం అనంతరం కాపు నేతలు గంటా నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ నేత బొండా ఉమ తదితరులు హాజరయ్యారు. ఈ భేటీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని గంటా అన్నారు. అన్నప్పటికీ ఇందులో ఎదో మర్మం దాగిఉన్నదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతుండటం గమనార్హం …