Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో ఎదురుదెబ్బ!

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో ఎదురుదెబ్బ!

  • పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల టోకరా
  • దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోదీ
  • భారత్ కు అప్పగింతపై బ్రిటన్ కోర్టు ఆదేశాలు
  • సుప్రీంకోర్టులో సవాల్ చేయాలనుకున్న నీరవ్
  • ఆ అవకాశం లేదన్న లండన్ హైకోర్టు

భారీ ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్ కు అప్పగించడంపై సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశం కల్పించాలని నీరవ్ మోదీ లండన్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, నీరవ్ మోదీ పిటిషన్ ను జస్టిస్ జెరెమీ స్టూవర్ట్ స్మిత్, జస్టిస్ రాబర్ట్ జే ధర్మాసనం తోసిపుచ్చింది.

తన మానసిక స్థితి సరిగా లేదని, తనను భారత్ కు అప్పగిస్తే ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకుంటానేమోనని నీరవ్ మోదీ పేర్కొనగా… నిజమే కావొచ్చు… కానీ మీలాంటి వాళ్లను ఎలా చూసుకోవాలో జైలు అధికారులకు బాగా తెలుసు అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ పిటిషన్ వేసినందుకు గాను మోదీ న్యాయపరమైన ఖర్చుల కింద రూ.1.5 కోట్లు చెల్లించాలిని ఆదేశించారు.

కాగా, లండన్ హైకోర్టు తాజా తీర్పుతో నీరవ్ మోదీకి అన్నిదారులు మూసుపోయినట్టే. నీరవ్ మోదీ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం నేటితో ఆవిరి కాగా, ఆయనను బ్రిటన్ ప్రభుత్వం భారత్ కు అప్పగించడం లాంఛనమే కానుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు దాదాపు రూ.11 వేల కోట్లకు టోకరా వేసినట్టు నీరవ్ మోదీ ఆరోపణలు ఎదుర్కొంటుండడం తెలిసిందే.

Related posts

కరోనా సెకండ్ వేవ్ తో సతమతమవుతున్న భారత్ కు మేం బాసటగా నిలుస్తాం: చైనా

Drukpadam

బిర్యానీ తిని రూ. 7 లక్షల విలువైన కారు గెలుచుకున్న అదృష్టవంతుడు!

Ram Narayana

హిజాబ్ వివాదంపై స్పందించిన పాకిస్థాన్ మంత్రులు…ఇది మా ఇంటి సమస్య మేము చూసుకోగలమన్న ఒవైసి !

Drukpadam

Leave a Comment