నేను ఇకనుంచి పాలేరు బిడ్డను …రాజన్న రాజ్యం తెస్తా :షర్మిల

నేను ఇకనుంచి పాలేరు బిడ్డనురాజన్న రాజ్యం తెస్తా :షర్మిల
పాలేరు నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం శంకుస్థాపన
సభలో షర్మిల ,విజయమ్మల భావోద్యగప్రసంగం
పాలేరు మట్టి సాక్షిగా మాట ఇస్తున్న మీకోసం ఎందాకైనా పోరాడతా
మార్పు ఖమ్మం జిల్లా పాలేరు నుంచే జరగాలి
మార్పు జరిగినా ఖమ్మం నుంచే ప్రారంభం అవుతుంది
పాలేరు ఖమ్మానికి ద్వారంమార్పుకు పాలేరు ప్రజలు నాంది పలకాలి
రాజశేఖర్ రెడ్డి పులిపులికడుపున పులే పుడుతుంది

 

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు . వేదపండితులు , మతప్రబోధకులు షర్మిలను ఆశ్వీర్వదించారు . సందర్భంగా జరిగిన సభలో షర్మిల ,విజయమ్మలు అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన తెచ్చేందుకే పార్టీ పెట్టానని పునఃరుద్ఘాటించారు . రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఐదు సంవత్సరాలు పరిపాలించి ఎలాంటి పాలన అందించారో మీకు తెలుసునని అలంటి పాలన తిరిగి తీసుకురావాలంటే తప్పకుండ వైయస్ ఆర్ తెలంగాణ పార్టీని అధికారంలోకి తీసుకోని రావాలని పిలుపు నిచ్చారు . పాలేరు మట్టి సాక్షిగా చెబుతున్న , రాజశేఖర్ రెడ్డి పులినేను పులి బిడ్డను మాట ఇస్తే మడమ తిప్పటం లేదు . మీ బిడ్డగా ఆశ్వీరదించి ,ఆదరించాలని కోరారు . తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు చేసిన ఒక్క వాగ్దానం కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు . పాలేరు నియోజకవర్గంలోని మూడు మండలాలలోని 180 గ్రామాలకు తాగునీరు ఇచ్చిన ఘనత స్వర్గీయ వైయస్సార్ దేనని ప్రజల హర్షద్వానాల మధ్య తెలిపారు . వైయస్ విజయమ్మ మాట్లాడుతూ తన బిడ్డ షర్మిల తన తండ్రి అడుగుజాడల్లో నడిచేందుకు పార్టీ పెట్టారని ఆమెను ఆశ్వీర్వదించాలని కోరారు . ఆమె పాదయాత్రలకు భయపడిన కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తుందని అయినప్పటికీ భయపడకుండా ప్రజల సహకారం తో నిర్బంధాలను అరెస్టులను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతుందని అన్నారు. ఖమ్మంకు స్వాగత గుమ్మంగా ఉన్న పాలేరు లో షర్మిలమ్మమీ మధ్యలో ఉండబోతుందని ఆమెను అక్కున చేర్చుకొని ఆదరించాలని కోరారు .

ఖమ్మంకు కూత వేటు దూరంలోని పాలేరు నియోజకవర్గ పరిధిలో కరుణగిరి వద్ద సాయిబాబా గుడికివెళ్ళే దారిలో సుమారు ఎకరం స్థలంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు . కార్యక్రమానికి ఎస్టీలు , ఎస్సీ లు హాజరైయ్యారు . కార్యక్రమంలో ప్రముఖ రియల్టర్ గరికపాటి ఆంజనేయ ప్రసాద్ కూడా పాల్గొని కొబ్బరి కాయ కొట్టారు . దీనిపై ఆయన్ను ప్రశ్నించగా ఇందులో ఏమి ప్రత్యేకత లేదని వారు స్థలం కొనుగోలు విషయంలో తన ప్రమేయం ఉన్నందున కొబ్బరికాయ కొట్టమని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారని అందువల్లనే కొట్టానని అన్నారు . పక్క జిల్లా మహబూబాబాద్ నుంచికూడా ఎస్టీలు రావడం విశేషం ….

 

Leave a Reply

%d bloggers like this: