Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సమీక్ష సమావేశంలో.. 32 మంది ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్!

సమీక్ష సమావేశంలో.. 32 మంది ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్!

  • గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై జగన్ సమీక్ష
  • ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోని వారి జాబితాను అందించిన ఐప్యాక్ సంస్థ
  • పద్ధతి మార్చుకోకపోతే కొత్త అభ్యర్థులను బరిలోకి దింపుతానంటూ జగన్ వార్నింగ్

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పనితీరు సరిగా లేని వారికి ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పనితీరు మెరుగు పరుచుకోవాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో వేటు తప్పదంటూ 32 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. వీరిలో కొందరు, మంత్రులు, మాజీ మంత్రులు కూడా ఉండటం గమనార్హం.

ఈ 100 రోజులు పార్టీకి చాలా ముఖ్యమైనవని జగన్ చెప్పారు. పనితీరు మార్చుకోని వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోనని, కొత్త అభ్యర్థులను బరిలోకి దింపుతానని అన్నారు. ఎవరినీ మార్చాలనే ఉద్దేశం తనకు లేదని… కానీ, ఆ పరిస్థితిని మీరే తెచ్చుకుంటున్నారని చెప్పారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కనీసం 10 రోజులు పాల్గొనాలని వైసీపీ ప్రజాప్రతినిధులకు గత సమావేశంలోనే జగన్ చెప్పారు. అయినప్పటికీ కొందరు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఈ కార్యక్రమంలో 10 రోజుల కంటే తక్కువగా పాల్గొన్న వారు 32 మంది వరకు ఉన్నారని ఐప్యాక్ సంస్థకు చెందిన రిషి తమ నివేదిక ద్వారా వివరించారు.

ప్రతి రోజు ఒక సచివాలయం పరిధిలో ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు పర్యటించాలని జగన్ ఇంతకు ముందు ఆదేశించారు. అయితే కొందరు గంట నుంచి రెండు గంటల సేపు మాత్రమే పర్యటిస్తూ 30 రోజులు పూర్తి చేశారు. ఇలాంటి వారి జాబితాను కూడా ఈ సమావేశంలో రిషి బయటపెట్టారు. ఇలాంటి వారు 20 మంది ఉన్నట్టుగా నివేదిక తేల్చింది. దీంతో, ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసిన వారిపై జగన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

సీఎం జగన్ సమీక్షపై వివరణ ఇచ్చిన కన్నబాబు

Kannababu explains CM Jagan review

ఏపీ సీఎం జగన్ ఇవాళ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. పనితీరు ఆధారంగా కొందరు ఎమ్మెల్యేలకు ఆయన హెచ్చరికలు చేసినట్టు తెలిసింది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు వివరణ ఇచ్చారు.

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సీఎం స్పష్టం చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమ లక్ష్యాలను అందుకోవడంలో వెనుకబడిన కొందరు ఎమ్మెల్యేలకు మార్చి వరకు గడువు నిర్దేశించారని తెలిపారు. ‘గడప గడపకు’ కార్యక్రమంపై మార్చిలో వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు సీఎం చెప్పారని, అప్పట్లోగా పనితీరు మార్చుకోవాలని సదరు ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారని కన్నబాబు వివరించారు.

గతంలో సెప్టెంబరు 29న ఈ కార్యక్రమంపై సమీక్ష జరగ్గా, ఇప్పటికి 78 రోజులు గడిచాయని, అందులో 40 రోజులు ‘గడప గడపకు’ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉందని అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఎక్కువ రోజులు కేటాయించలేకపోయారని, మరికొందరు ఎక్కువ సమయం పాల్గొనలేకపోయారని, ఈ విషయాన్ని గుర్తించిన సీఎం వారికి ఎక్కువ రోజులు, ఎక్కువ సమయం గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారని కన్నబాబు వెల్లడించారు.

ఎన్ని పనులు ఉన్నా, వాటితో పాటే ఈ కార్యక్రమం కూడా జరిగి తీరాలన్న సంకల్పంతో ముందుకు కదలాలని నిర్దేశించారని వివరించారు. మనం ఇన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతే, వాటిలోని లోపాలను ప్రజల నుంచి తెలుసుకోకపోతే ఫలితం ఉండదని సీఎం అభిప్రాయపడ్డారని తెలిపారు.

Related posts

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేను దూరం: రాహుల్ గాంధీ!

Drukpadam

మేమిచ్చిన ఆఫర్ పట్ల మాయావతి నుంచి కనీస స్పందన లేదు: రాహుల్ గాంధీ

Drukpadam

ఓపిక నశించింది.. అణుబాంబు వేసే సమయం వచ్చింది…పుతిన్‌

Drukpadam

Leave a Comment