తెలంగాణా కాంగ్రెస్ లో ముసలం …

తెలంగాణా కాంగ్రెస్ లో ముసలం
కాంగ్రెస్ ను నష్టపరిచే కుట్ర జరుగుతుందని సీనియర్ల మండిపాటు …!
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలపై సీనియర్ల తిరుగుబాటు !
సీఎల్పీ నేత భట్టిని అవమానిస్తున్నారన్న సీనియర్లు
రాష్ట్రంలో నిర్ణయం జరగాలన్నపీసీసీ ,సీఎల్పీ కలిసి తీసుకోవాలి! కానీ ఆలా జరగటం లేదని ఆగ్రహం
ఇటీవల వేసిన కమిటీల్లో సగానికిపైగా టీడీపీ నుంచి వచ్చినవారేనని విమర్శలు
కాంగ్రెస్ ను నాశనం చేసేందుకు కుట్ర జరుగుతుందన్న మధుయాష్కీ
అధిష్టానానికి అవగాహనా లేకుండానే కమిటీలు వేశారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
విషయం అధిష్టానం వద్దనే తేల్చుకుంటాం
భట్టికి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఫోన్
ఎలాంటి నిర్ణయం తీసుకున్న మీవెంటే ఉంటా అన్న కోమటిరెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం పుట్టింది….టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం దగ్గర నుంచి కాంగ్రెస్ లో వర్గవిభేదాలు ఎక్కువయ్యాయి. ఇటీవల నియమించిన పీసీసీ కార్యవర్గం ఆఫీస్ బేరర్ల , రాజకీయ వ్యవహారాల కమిటీల్లో టీడీపీనుంచి వచ్చిన వారిని , జూనియర్లను నియమించారని కాంగ్రెస్ సీనియర్లు భగ్గుమంటున్నారు .దీనిపై సీఎల్పీ నేత భట్టి నివాసంలో సమావేశమైన సీనియర్లు పీసీసీ చీఫ్ ఏకపక్ష నిర్ణయాలపై చర్చించారు . సమావేశంలో మాజీ పీసీసీ చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి , మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ , జగ్గారెడ్డి , మధుయాష్కీ గౌడ్ , తదితరులు పాల్గొన్నారు .సమావేశంలో రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలపై అధిష్టానానికి కలిసి ఫిర్యాదు చేయాలనీ నిర్ణయించుకున్నారు . అక్కడే తాడో,పేడో తెల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

రాష్ట్రంలో మరి కొద్దీ నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ పరిణామాలు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని పరిశీలకు అభిప్రాయపడుతున్నారు . అధికారంలోకి వస్తామన్నా దీమా కాంగ్రెస్ శ్రేణుల్లో సన్నగిల్లుతుంది.అధికారం వచ్చే అవకాశమున్న రాష్ట్రాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పీసీసీ కార్యవర్గంలో 120 ని నియమించగా వారిలో 60 మందికి పైగా టీడీపీ నుంచి వచ్చినవారేననే సీనియర్లు భగ్గుమంటున్నారు . పార్టీలో సంవత్సరాల కొద్దీ ఉండి పార్టీని కాపాడుతున్న కార్యకర్తలను నాయకులను కాదని కొత్తవారికి ,వేరే పార్టీలనుంచి వచ్చినవారికి పెద్ద పీఠ వేయడంపై పార్టీలో ముసలానికి కారణమైంది. అధిష్టానం అవగాహనా లేకుండా పీసీసీ చీఫ్ ఇచ్చిన పేర్లను కమిటీల్లో ప్రకటించడం , సీఎల్పీ నేత భట్టిని అవమానించడమేనని అంటున్నారు సీనియర్లు . అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ను బతికించే చర్యలు ఇవేనా అంటూ సీనియర్లు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. పీసీసీ , సీఎల్పీ నేతలు ఇద్దరి అభిప్రాయాల మేరకు రాష్ట్రంలో పార్టీలో నిర్ణయాలు జరగాలని నిర్ణయించుకున్నప్పటికీ అందుకు విరుద్ధంగా సీఎల్పీ నేతకు తెలియకుండానే కమిటీల నియకామం ఏమిటని నిలదీస్తున్నారు .

భట్టి నివాసంలో సీనియర్లు సమావేశమైన విషయం తెలుసుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భట్టికి ఫోన్ చేసి సీనియర్లు తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలపడం విశేషం .

రేవంత్ రెడ్డి నియకమే సరిగా జరగలేదనే విమర్శలు ఉన్న నేపథ్యంలో . పీసీసీ చీఫ్ పదవిని ఆశించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాటినుంచి తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు . తాజా పరిణామాలు కాంగ్రెస్ అధిష్టానానికి సైతం తలనొప్పిగా మారాయి.

Leave a Reply

%d bloggers like this: