రష్యా గెలిచాకే యుద్ధం ఆగుతుంది..పుతిన్ సలహాదారు!

రష్యా గెలిచాకే యుద్ధం ఆగుతుంది.. లేదా ప్రపంచ వినాశనమే: పుతిన్ సలహాదారు!

  • ఉక్రెయిన్ తో యుద్ధంపై అలెగ్జాండర్ సంచలన ప్రకటన
  • రష్యా గెలుపు అంత సులభం కాదని ఒప్పుకున్న అలెగ్జాండర్
  • పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం కాదని స్పష్టత

ఉక్రెయిన్ తో యుద్ధంపై పుతిన్ సలహాదారు తాజాగా సంచలన ప్రకటన చేశారు. రష్యా గెలిచిన తర్వాతే యుద్ధం ఆగుతుందని, అప్పటివరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయని తేల్చిచెప్పారు. లేదంటే ప్రపంచ వినాశనం తప్పదని హెచ్చరించారు. ఈమేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సలహాదారు అలెగ్జాండర్ డుగిన్ తాజాగా ప్రకటన చేశారు. ఈ ప్రకటన రష్యా అధ్యక్షుడి ఆలోచనలకు ప్రతిరూపంగా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం యుద్ధం బహుళ ధ్రువ ప్రపంచం దిశగా సాగుతోందని డుగిన్ చెప్పారు. ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధమని చెప్పారు. ఈ యుద్ధం పశ్చిమ దేశాలకో, మరే ఇతర దేశాలకో వ్యతిరేకంగా జరుగుతున్నది కానే కాదని ఆయన స్పష్టం చేశారు. యుద్ధ ప్రభావం ప్రపంచంపై ఎలా ఉండబోతోంది, యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని విలేఖరులు అడగగా.. రష్యా గెలిచిన వెంటనే యుద్ధం ఆగిపోతుందని డుగిన్ చెప్పారు. అయితే, అదంత సులువు కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచం నాశనమైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోతుందని వివరించారు. మేం గెలవడమా.. ప్రపంచ నాశనమా.. రెండింటిలో ఏదో ఒకటి జరగనిదే యుద్ధం ఆగదని డుగిన్ స్పష్టంచేశారు.

Leave a Reply

%d bloggers like this: