మాది అణ్వస్త్ర దేశం… భారత్ ను బెదిరించిన పాక్ మహిళా మంత్రి!

మాది అణ్వస్త్ర దేశం… భారత్ ను బెదిరించిన పాక్ మహిళా మంత్రి!
-మోదీ గుజరాత్ ఊచకోతకు కారకుడన్న బిలావల్ భుట్టో
-భారత్ లో బీజేపీ వర్గాల ఆగ్రహం
-భుట్టోకు మద్దతుగా మహిళా మంత్రి షాజియా వ్యాఖ్యలు
-తమ వద్ద అణుబాంబు ఉందంటూ హెచ్చరిక

పాకిస్థాన్ మహిళా మంత్రి షాజియా మారీ భారత్ విషయంలో దుందుడుకు వ్యాఖ్యలు చేశారు. పాక్ ఒక అణ్వస్త్ర దేశం అన్న సంగతిని భారత్ గమనించాలని హెచ్చరిక చేశారు. తమ అణ్వస్త్ర హోదా మౌనంగా ఉండేందుకు కాదని, అవసరమైతే వెనుకంజ వేసే ప్రసక్తేలేదని షాజియా స్పష్టం చేశారు.

“ఎలా జవాబు ఇవ్వాలో పాకిస్థాన్ కు తెలుసు. చెంపమీద కొడితే ఊరికే చూస్తూ ఉండిపోదు. అదే స్థాయిలో బదులిస్తుంది. మా వద్ద అణుబాంబు ఉందన్న విషయం భారత్ మర్చిపోరాదు. భారత ప్రధాని మోదీ దేశంలో విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారు. హిందూయిజం, హిందుత్వ అంశాలు మోదీ ప్రభుత్వంలో విజృంభిస్తున్నాయి. భారత్ ముస్లింలను ఉగ్రవాదంతో ముడివేస్తోంది” అంటూ షాజియా మారీ మండిపడ్డారు.

అంతకుముందు, పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు భారత్ లో బీజేపీ వర్గాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. గుజరాత్ లో ఊచకోతకు కారకుడు మోదీ అంటూ భుట్టో వ్యాఖ్యానించారు. ఇప్పుడు భుట్టోకు మద్దతుగా షాజియా మారీ వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

%d bloggers like this: