Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చంద్రబాబు ఖమ్మం పర్యటన బీజేపీకి దగ్గర చేస్తుందా …?

చంద్రబాబు ఖమ్మం పర్యటన బీజేపీకి దగ్గర చేస్తుందా …?
-ఖమ్మం జిల్లాలో చంద్రబాబు పర్యటనపై ఆసక్తి
-జిల్లారాజకీయాల్లో మార్పులు రానున్నాయా ?
-తెలంగాణ రాజకీయాలను చంద్రబాబు మలుపు తిప్పగలడా ?

చంద్రబాబు బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు .నాలుగు సంవత్సరాల క్రితం గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీతో కలిసి ఖమ్మంలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు .చాలాకాలం తర్వాత ఖమ్మం రానున్న చంద్రబాబు పర్యటనపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొన్నది . ఇటీవల తెలంగాణపై కేంద్రీకరించిన చంద్రబాబు తరుచు ఇక్కడ నాయకులతో సమావేశం అవుతున్నారు . పర్యటనలు జరుపుతున్నారు . చంద్రబాబు పర్యటనకు ఉన్న ప్రత్యేకత ఏమిటి ? పార్టీ శ్రేణులకు ఏమి సందేశం ఇవ్వనున్నారు . తెలంగాణాలో అధికారంలో ఉన్న బీఆర్ యస్ పార్టీ పై చంద్రబాబు వైఖరి ఏమిటి ? ఆయన ఖమ్మం సభలో ఏమి మాట్లాడతారు ? అనే విషయాలపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొన్నది .

చంద్రబాబు పర్యటనపై మరో వాదన కూడా ఉంది. ఖమ్మంలో తమ బలం చాటుకోవడం ద్వారా తెలంగాణాలో పార్టీ ఉనికి తెలియజేయడం ఏపీలో బీజేపీ,జనసేన తో కలిసి ఎన్నికల్లోకి వెళ్లాలని పధక రచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందువల్లనే గత ఎన్నికల్లో రెండు సీట్లు గెలిచిన టీడీపీకి జిల్లాలో కొంత ఓటింగ్ , క్యాడర్ బలం ఉన్న ఖమ్మం ను ఎంచుకున్నట్లు పరిశీలకుల అభిప్రాయం . తెలంగాణలో పార్టీని నిర్మాణం చేయడం ద్వారా వచ్చేఎన్నికల్లో తమ శక్తిని బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు తోడ్పాటు నివ్వడం ,అదే సందర్భంలో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ సహాయం తీసుకోవడం అనేది వైస్ వర్సగా ఉండబోతుందని అంటున్నారు .

రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం …నిన్నటివరకు శత్రువులుగా ఉన్నవారు నేడు మిత్రులు అవుతారు. నేడు మిత్రులు రేపుశత్రువులు అవుతారు . ఇది కామన్ గా జరిగేదే …40 సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం గా ,రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తోలి ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించారు .భారతదేశ రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు .కానీ నేడు అధికారం కోసం ఎవరితో వెళ్ళాలి …అధికారం ఏ విధంగా తెచ్చుకోవాలి అనే ఎత్తులు వేస్తూ ,తన వ్యూహాలకు పదును పెడుతున్నారు .

దీనికి బలం చేకూర్చేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా తన పర్యటనల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూస్తానని అంటున్నారు .అయితే ఇది ఎంతవరకు సాధ్యం అనేది ప్రశ్నర్ధకంగా మారింది. బీజేపీ ఉన్న కూటమిలో లెఫ్ట్ పార్టీలు ఉండవు .. అయితే టీడీపీని దగ్గరకు రానిచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదనే ప్రచారం జరుగుతుంది. అయితే తెలంగాణాలో టీడీపీ బలం బీజేపీకి తోడ్పడనుందా ? అందుకు బీజేపీ అధిష్టానం అంగీకరిస్తుందా ? తెలంగాణాలో తమ బలం చూపించడం ద్వారా బీజేపీని మెప్పించి ఏపీలో కలిసి నడుస్తారా ? అనేది చూడాలి …

Related posts

రాష్ట్రపతి బరిలో శరద్ పవార్.. రాజకీయవర్గాలలో ఆశక్తికర చర్చ

Drukpadam

పటేల్ సామాజికవర్గానికి గుజరాత్ సీఎం సీటు …నూతన సీఎం గా భూపేంద్ర పటేల్!

Drukpadam

మంత్రిపదవులపై రగులుతున్న ఏపీ … ఎమ్మెల్యే పదవికి సుచరిత రాజీనామా!

Drukpadam

Leave a Comment