Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నెపం నాదికాదు…కేసీఆర్, కేటీఆర్ లది …మంత్రి మల్లారెడ్డి!

నెపం నాదికాదు…కేసీఆర్ కేటీఆర్ లది …మంత్రి మల్లారెడ్డి!
-ఎమ్మెల్యేల తిరుగుబాటు పై తెలివిగా తప్పుకునేందుకు మంత్రి మల్లారెడ్డి ప్రయత్నం..
-పదవులు ఇచ్చేది కేసీఆర్, కేటీఆర్ తప్ప నేను కాదంటున్న మంత్రి
-మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఐదుగురు ఎమ్మెల్యేల సమావేశం
-తాను ఎవరితోనూ గొడవ పెట్టుకోనన్న మల్లారెడ్డి
-అందరితో మాట్లాడతానని వెల్లడి

మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలపై ఆజిల్లాకు చెందిన సొంతపార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు .దీనిపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ పదవులు ఇచ్చేది నేనుకాదు సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ అని, నాకు పదవులు ఇచ్చేదాంట్లో ఎలాంటి సంబంధం లేదని నెపం వారిపై నెట్టే ప్రయత్నం చేశారు .అందరి ఎమ్మెల్యేలతో మాట్లాడతాను అందరిని తన ఇంటికి పిలుస్తానని పేర్కొంటున్నారు . నెపం సీఎం కేసీఆర్ , కేటీఆర్ పై నెట్టే ప్రయత్నం చేసేందుకు మంత్రి ప్రయత్నించడం పట్ల ఎమ్మెల్యేలు ఆగ్రహంగా ఉన్నారు . మంత్రి సిఫారుసుల మేరకే ఇది జరుగుతుందని అందువల్ల సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ను తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఖండించారు .

నామినేటెడ్ పదవుల భర్తీలో మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్న ఆరోపించిన సంగతి తెలిసిందే. వీరిలో అరికెపూడి గాంధీ, మైనంపల్లి హన్మంతరావు, వివేకానంద్, మాధవరం కృష్ణారావు, భేతి సుభాష్ రెడ్డి ఉన్నారు. వీరంతా హైదరాబాద్ శివారులోని మైనంపల్లి నివాసంలో సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవులను తన నియోజకవర్గం మేడ్చల్ నాయకులకే మల్లారెడ్డి కట్టబెడుతున్నారని వారు విమర్శించారు. ఈ భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో మల్లారెడ్డి స్పందిస్తూ… పదవులు ఇచ్చేది కేసీఆర్, కేటీఆర్ తప్ప తాను కాదని అన్నారు. తాను గాంధేయవాదినని, ఎవరితోనూ గొడవ పెట్టుకునే రకం కాదని చెప్పారు. జిల్లాకు చెందిన అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడతానని అన్నారు. అవసరమైతే వారందరినీ తన ఇంటికి ఆహ్వానిస్తానని చెప్పారు. కావాలనే కొందరు ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇంటి సమస్యలను అందరం కలిసి పరిష్కరించుకుంటామని చెప్పారు.

Related posts

రాహుల్ జోడో యాత్రలో పాల్గొన్న టీచర్ పై సస్పెన్షన్ వేటు!

Drukpadam

అగ్నిపథ్​ పై కాంగ్రెస్​ సత్యాగ్రహం… ఢిల్లీ జంతర్​మంతర్​ దగ్గర దీక్ష !

Drukpadam

‘కాట్సా’ చట్టం నుంచి భారత్ కు మినహాయింపులు ఇవ్వలేం: అమెరికా!

Drukpadam

Leave a Comment