ఆంధ్రాలో కన్నా తనకు తెలంగాణాలో ఆదరణ : ఖమ్మం సభలో చంద్రబాబు …

ఆంధ్రాలో కన్నా తనకు తెలంగాణాలో ఆదరణ : టీడీపీ నేత చంద్రబాబు
ఖమ్మం శంఖారావం సభలో బాబు సుదీర్ఘ ప్రసంగం
తెలంగాణాలో నేను ప్రారంభించిన ప్రాజెక్టులు కొనసాగించడాన్ని స్వాగతిస్తున్నా .
ఐటీ తెచ్చింది నేనేశంషాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కర్తను నేనే
రింగ్ రోడ్ ఘనత నాదేహైవే ప్రాజక్టులకు ఆద్యుడను నేనే
ఖమ్మంలో మెడికల్ కాలేజీ ఇచ్చింది నేనే
ఇక్కడ ఇరిగేషన్ ప్రాజక్టులు పూర్తీ చేసిన ఘనత టీడీపీదే!
ఐటీ అభివృద్ధి కోసం బిల్ గెట్స్ ను హైద్రాబాద్ కు రప్పించా!

తనకు ఆంధ్రాలో కన్నా నాకు తెలంగాణలోనే ఆదరణ ఎక్కువగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు .తాను హైద్రాబాద్ లో బయలుదేరిన దగ్గరనుంచి ఖమ్మం వచ్చే వరకు లభించిన ఆపూర్వస్వాగతాన్ని జీవితంలో మరిచిపోలేనని సభికుల హర్షద్వానాల మధ్య చెప్పారు . బుధవారం ఖమ్మం వచ్చిన ఆయన స్థానికి సర్దార్ పటేల్ స్టేడియం లో జరిగిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు . హైద్రాబాద్ అభివృద్ధికి కారకున్నే తానేనని , ఐటీ ని హైద్రాబాద్ కు తీసుకోని వచ్చిన ఘనత తనదేనని అన్నారు . తెలంగాణాలో తాను ప్రారంభించిన ప్రాజక్టులను ఇక్కడ ప్రభుతం కొనసాగించడాన్ని స్వాగతించారు .ఐటీ తెచ్చింది నేనేశంషాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కర్తను నేనే
రింగ్ రోడ్ ఘనత నాదేహైవే ప్రాజక్టులకు ఆద్యుడను తానేనని చెప్పుకొచ్చారు .

ఐటీ ఇచ్చారని యువత స్వాగతం పలకడం ఆనందంగా ఉందని అన్నారు . నేను కోరుకొనేది అధికారం కాదు ప్రజల అభిమానమని ఉద్గాటించారు . తనను కొంతమంది ఏమి చేశారని అడుగుతున్నారు. తాను నిరంతరం ప్రజల మేలుకోసం , పిల్లల భవిషత్ కోసం ఆలోచించానని అన్నారు .

పార్టీ స్థాపకుడు ఎన్టీఆర్ వ్యక్తికాదు. ఒక శక్తితెలుగుజాతీ ఆత్మగౌరంకోసం పార్టీ పెట్టారు . హైద్రాబాద్ లో పుట్టిన పార్టీ తెలుగు దేశంఅసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి ఆయన ….2 రూ కి. బియ్యం పథకం తెచ్చిన గొప్పనాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు . …పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన వ్యక్తి ….50 రూ కరెంట్….పేదవాడు గుడిశలో కాదు….పక్కాగా భవనంలో ఉండాలని పక్క గృహాలు నిర్మించిన మహానుభావుడని కొనియాడారు .

తాను ఏది చేసిన టీనేజర్ గా ఆలోచిస్తాను….ఎప్పడు ఎన్నికలకోసం పని చేయలేదు. ఐఎస్ బీ కి వెళ్ళానుఅన్ స్టాపబుల్ వెళ్లాను…. అందులో ఏది దాచుకోకుండా చెప్పనుచెప్పనా లేదా తమ్ములు అని సభికులను అడిగారు .

ఇంజనీరింగ్ కాలేజీలు తానే ఇచ్చాననిఐటీ ముందుగానే ఆలోచించి హైటెక్ సిటీ నిర్మించానుప్రపంచం అంతా కాలుకు బలపం కట్టుకుని తిరిగాను. బిల్ గేట్స్ ను తీసుకొచ్చాం…. ముందు అపాయింట్మెంట్ ఇవ్వని బిల్ గేట్స్ 10 నిమిషాలు అంటే 1 గంట ఇచ్చారు. ఆయన్ను హైద్రాబాద్ తీసుకొచ్చా నాకోసం కాదు . వాళ్లకు స్వాగతం పలికాహైదరాబాద్ అభివృద్ధి చేశా….భవిష్యత్ బయోటెక్నాలజీ దేనని ముందే గుర్తించి ఇక్కడ ఏర్పాటు చేయించన్నారు ….వ్యాక్సిన్…. సెల్ ఫోన్ నేనే తెచ్చా….ఎప్పుడు వచ్చింది సెల్ ఫోన్ తమ్ములు తెలుసా అని అన్నారు .… ఖమ్మంలో కూర్చొని ఆస్ట్రేలియాకు పని చేస్తున్నాంశంషాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవే….సూర్యాపేటఖమ్మం రోడ్. తడ విజయవాడ రోడ్ తెప్పించిన ఘనత తనదే నన్నారు ….సంపద సృష్టించాం

బీసీలకు ఎన్టీఆర్ 25 శాత పెడితే, నేను 33 శాతానికి పెంచా బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం లోకి రావాలని తపన చెందాం ఫలితంగానే అనేకమంది బీసీలు అధికారంలోకి వచ్చారని అన్నారుఆడ పిల్లలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాఅనేక మార్పులు తెచ్చానేను ప్రారంభించినవి కొనసాగిస్తున్నారు. భద్రాచలం వరదలు అరికట్టేందుకు కరకట్ట కట్టించాంఅభివృద్ధికి చిరునామాగా ఉన్న తెలుగుదేశం బలంగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు .…

తెలుగుదేశం ఎక్కడా అని అడిగిన వారికి ఖమ్మంసభ సమాధానం చెబుతుందని అన్నారు . 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా రికార్డ్ ఉందని పేర్కొన్నారుఏపీలో లో గాడితప్పిన పాలనను గాడిలో పెట్టె బాధ్యత తమదేనన్నారు ….విజన్ 20:20 …దేశం లో తెలుగు రాష్ట్రాలు నెంబర్ వన్ గా ఉండాలనే కోరుకున్నానని అన్నారు ..

మనవాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. అదే ప్రధానికి చెప్పానుతెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ….నీటి ప్రాజెక్ట్ లు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు కట్టాం….రోడ్లు వేసాంవిభజన హామీలు అమలు చేయాలిఖాజీ పేట కోచ్ ఫ్యాక్టరీ .. స్పాంజి ఐరన్ కర్మాగారం , బయ్యారం స్టీల్ ప్లాంట్ అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్న విషయాన్నీ ప్రస్తావించారు .

ఖమ్మంజిల్లాఅభివృద్దికి కారణం టీడీపీనేని అన్నారు ….ఖమ్మం మెడికల్ కాలేజీ తామే ఇచ్చాం అన్నారు ….ఒట్లు అడిగే హక్కు తెలుగుదేశంకు ఉంది…. కార్యకర్తలు యాక్టివ్ కావాలని పిలుపు నిచ్చారు . …ఒక్క ఎమ్మెల్యే లేడుఎమ్మెల్సీ లేడు….అయినా ఇంతమంది సభకు రావడం చిన్న విషం కాదన్నారు .

తెలంగాణాలో తెలుగుదేశంకు పునర్వైభవం తీసుకోని రావాలని అన్నారు …. రైతులకు గిట్టుబాటు ధరలేదు. కనీస మద్దతు ధర రావాలిసమర్ధవంతంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని ఆవిధంగా లేకపోవడం భాదగా ఉందని అన్నారు .

 

Leave a Reply

%d bloggers like this: