Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ కాంగ్రెస్ కు డిగ్గీరాజా చికిత్స…

తెలంగాణ కాంగ్రెస్ కు డిగ్గీరాజా చికిత్స…
-కలిసుండి విడిపోవడమా…? విడిపోయి కాలవడమా…?
-విడివిడిగా రాష్ట్ర నేతలతో సమావేశాలు
-రాష్ట్రం గురించి ఆయనకు అంతా తెలుసన్న సీనియర్లు
-తాను దిగ్విజయ్ ని కలిసి కొన్ని సూచనలు చేశానన్న జానారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న వర్గవిభేదాలను చల్లార్చి అందరిని ఐక్యం చేసేందుకు ఉమ్మడి రాష్ట్రానికి ఇంఛార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చారు. వచ్చిరాగానే ఇక్కడ నాయకుల మధ్య ఉన్న విభేదాలపై చర్చించేందుకు రంగంలోకి దిగి చికిత్స మొదలు పెట్టారు . అందిస్తాం దూతలతో పాటు రాష్ట్ర నాయకుల రాకతో హైద్రాబాద్ లోని గాంధీభవనం కోలాహలంగా మారింది.అనుకూల ప్రతికూల వర్గాల నినాదాలతో దద్దరిల్లింది.

సమావేశంలో టీపీసీసీ చీఫ్ ,రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ,మాజీ సీఎల్పీ నేత కె .జానారెడ్డి , డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి , మల్లు రవి ,షబ్బీర్ అలీ ,దామోదర రాజనరసింహ , గీతారెడ్డి ,శ్రీధర్ బాబు , జీవన్ రెడ్డి , బలరాం నాయక్ , బెల్లయ్య నాయక్, సీతక్క , జగ్గారెడ్డి ,తదితరులు దిగ్విజయ్ సింగ్ ను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు . అందరితో విడివిడిగా సమావేశమైన దిగ్విజయ్ నాయకులూ చెప్పిన మాటలు విని వారికీ కొన్ని సూచనలు చేశారు . కొంతమంది రేవంత్ వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేయగా , మరికొందరు సీనియర్ల వ్యవహారాలు పార్టీకి నష్టం కలిగించేవిగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు . సీనియర్లను పట్టించుకోకుండా పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ,రాజకీయవ్యహారాల కమిటీని నియమించడాన్ని తప్పు పట్టారు .అంతే కాకుండా పీసీసీ చీఫ్ , సీఎల్పీ నేతలను సంప్రతించి కమిటీలు వేయాల్సి ఉండగా సీఎల్పీ నేతకు తెలియకుండా కమిటీల ఏర్పాటుపై తమ అసంతృప్తిని వెల్లడించినట్లు సమాచారం . మరో కొద్దీ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రంలో గ్రూపులుగా విడిపోయి కాంగ్రెస్ నేతలు బజారుకు ఎక్కడంపై అధిష్టానం సైతం సీరియస్ గానే ఉంది. రెండువైపులా లోపాలు ఉన్నాయని డిగ్గీరాజా అభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం . పీసీసీ చీఫ్ సమన్వయం చేసుకోవాల్సి ఉందని , సీఎల్పీ నేతతో సంప్రదించిన తర్వాతనే కమిటీల ఎంపిక జరపకపోవడంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. టీడీపీ నుంచి వచ్చినవారికి అధికంగా పదవులు ఇచ్చి ఎప్పటినుంచో పార్టీలో ఉంటున్న సీనియర్లను అవమానపరచడంపై అధిష్టానం సైతం అసహనంగా ఉన్నట్లు తెలుస్తుంది. అందువల్ల సీనియర్లను గౌరవించుకోవాల్సిన భాద్యతను తెలియజెప్పినట్లు సమాచారం . అయితే డిగ్గీ రాజా చికిత్స ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది. కలిసుండి విడిపోవడమా…? విడిపోయి కాలవడమా…?అనేదానిపై ఆసక్తి నెలకొన్నది …

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు రాకపోవడంపై లోతుగా పరిశీలన చేసి కాంగ్రెస్ లో ఉన్న లోపాలను సరిదిద్దుకొని ముందుకు వెళ్లాలని దిగ్విజయ్ స్థానిక నేతలకు దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం .

 

Related posts

మంత్రి ఈటల భూకబ్జాలకు పాల్పడ్డారా ? ఉద్వాసన ఖాయమేనా!

Drukpadam

ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం …ఎవరడ్డుకుంటారో చూస్తా …కత్తిపూడి సభలో పవన్ కళ్యాణ్ …

Drukpadam

జగన్ ముందస్తు ఎన్నికలకు సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు :బీజేపీ నేత సత్యకుమార్ …

Drukpadam

Leave a Comment