ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర సామ్ కరన్ కు 18 .50 కోట్లు

రూ.18.50 కోట్లతో రికార్డ్… ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పొందిన శామ్ కరన్!

ఐపీఎల్ వేలంలో రూ.16 కోట్లు కొల్లగొట్టిన వెస్టిండీస్ మాజీ కెప్టెన్!
  • ఐపీఎల్ వేలంలో రికార్డు
  • శామ్ కరన్ ను కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
  • ఆసీస్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ కు రూ.17.50 కోట్లు
  • బెన్ స్టోక్స్ కు రూ.16.25 కోట్ల ధర

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పొందిన ఆటగాడిగా ఇంగ్లండ్ యువ ఆల్ రౌండర్ శామ్ కరన్ నిలిచాడు. నేటి ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఈ ఎడమచేతివాటం ఆటగాడికి ఏకంగా రూ.18.50 కోట్ల భారీ ధర లభించింది.

శామ్ కరన్ ను దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజీలు హోరాహోరీగా వేలం పాటను పెంచేశాయి. అతడి కనీస ధర రూ.2 కోట్లు కాగా…. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరికి రూ.18.50 కోట్లతో శామ్ కరన్ ను పంజాబ్ కింగ్స్ చేజిక్కించుకుంది. 2008లో ఐపీఎల్ ప్రారంభం అయ్యాక, అప్పటినుంచి మరే ఆటగాడికీ ఇంత ధర లభించలేదు.

ఇక, ఆస్ట్రేలియా యువ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ సైతం ఇవాళ్టి వేలంలో సంచలనం సృష్టించాడు. గ్రీన్ కోసం ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటాపోటీగా వేలం పాటలో పాల్గొన్నాయి. కామెరాన్ గ్రీన్ కనీస ధర రూ.2 కోట్లు కాగా, అతడిని ముంబయి ఇండియన్స్ రూ.17.50 కోట్లతో కొనుగోలు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక ధర కావడం విశేషం.

ఇంగ్లండ్ సీనియర్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సైతం కోట్లు కొల్లగొట్టాడు. ఈసారి వేలంలో నిలిచిన స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.16.25 కోట్లకు దక్కించుకుంది.

ఓ దశలో లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు స్టోక్స్ కోసం పోటీపడ్డాయి. రూ.15 కోట్ల బిడ్ వద్ద సన్ రైజర్స్ రేసు నుంచి వైదొలగింది. తాము తప్పుకుంటున్నట్టు సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి చెందిన కావ్యా మారన్ వేలం నిర్వాహకుడు ఎడ్మీడియస్ కు స్పష్టం చేశారు. ఇక స్టోక్స్ లక్నో జట్టుకే అని అందరూ భావించేలోగా, చివరి నిమిషంలో సీఎస్కే ఫ్రాంచైజీ రంగంలోకి దిగింది. భారీతో ధరతో స్టోక్స్ ను దక్కించుకుంది.

ఐపీఎల్ వేలంలో రూ.16 కోట్లు కొల్లగొట్టిన వెస్టిండీస్ మాజీ కెప్టెన్!

  • గత సీజన్ లో హైదరాద్ తరఫున ఆడిన పూరన్
  • ఆశించిన స్థాయిలో రాణించని వైనం
  • జట్టు నుంచి విడుదల చేసిన సన్ రైజర్స్
  • ఈసారి వేలంలో అదిరిపోయే ధర

కొచ్చిలో జరుగుతున్నది ఐపీఎల్ మినీ వేలం అయినా రికార్డుల మోత మోగుతోంది. తాజాగా, వెస్టిండీస్ మాజీ సారథి నికోలాస్ పూరన్ కు వేలంలో రూ.16 కోట్ల ధర పలికింది. విధ్వంసక బ్యాటింగ్ తో చెలరేగే పూరన్ ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కనీస ధర రూ.2 కోట్లు కాగా, నేటి వేలంలో అంతకు 8 రెట్లు ధర పలకడం విశేషం. ఐపీఎల్ గత సీజన్ లో పూరన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు. అప్పటి వేలంలో సన్ రైజర్స్ పూరన్ ను రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో సన్ రైజర్స్ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది.

ఇక ఇవాళ్టి వేలంలో అమ్ముడైన ఆటగాళ్ల వివరాలు…

శివమ్ మావి- రూ.6 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
ముఖేశ్ కుమార్- రూ.5.5 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
హెన్రిచ్ క్లాసెన్- రూ.5.25 కోట్లు (సన్ రైజర్స్ హైదరాబాద్)
విల్ జాక్స్- రూ.3.2 కోట్లు (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)

మనీష్ పాండే- రూ.2.4 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
అదిల్ రషీద్- రూ.2 కోట్లు (సన్ రైజర్స్ హైదరాబాద్)
ఫిల్ సాల్ట్- రూ.2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
రీస్ టాప్లే- రూ.1.9 కోట్లు (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)
జే రిచర్డ్సన్- రూ.1.5 కోట్లు (ముంబయి ఇండియన్స్)
శ్రీకర్ భరత్- రూ1.20 కోట్లు (గుజరాత్ టైటాన్స్)

డేనియల్ సామ్స్- రూ.75 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్)
వైభవ్ అరోరా- రూ.60 లక్షలు (కోల్ కతా నైట్ రైడర్స్)
జయదేవ్ ఉనద్కట్- రూ.50 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్)
ఇషాంత్ శర్మ- రూ.50 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
రొమారియో షెపర్డ్- రూ.50 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్)

ఉపేంద్ర యాదవ్- రూ.25 లక్షలు (సన్ రైజర్స్ హైదరాబాద్)
హిమాంశు శర్మ- రూ.20 లక్షలు (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)

Leave a Reply

%d bloggers like this: