Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎన్నికలప్పుడే పొత్తులు ,ఎత్తులు :సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని..!

ఎన్నికలప్పుడే పొత్తులు ,ఎత్తులు :సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని..!
ఖమ్మంలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా అనేక విషయాలు పంచుకున్న సిపిఎం నేత
ఎవరికి సీటు హామీ లేదు.. ఇంకా అలంటి చర్చలు జరగలేదు
బీజేపీ ప్రమాదాన్ని నివారించేందుకేబీఆర్ యస్ తో చెలిమి
వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్రసభల సందర్భంగా లక్షమందితో సభ
కాంగ్రెస్ బలహీనపడిందిలౌకిక శక్తులు బలపడాలి
కమ్యూనిస్టుల ప్రభావం తగ్గిందిప్రజాపోరాటాలే మా ఆయుధాలు

 

రాష్ట్రంలో మరో 10 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సహజంగానే ఎన్నికలపై ఎవరి వైఖరి ఏమిటి ? కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ యస్ తో వెళ్లడం కమ్యూనిస్టులకు తగునా ? ఇది అపవిత్ర కలయిక కదా ? అంటూ జరుగుతున్నా ప్రచారంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తమ్మినేని తనదైన శైలిలో స్పందించారు. సోమవారం ఖమ్మంలో నిర్వహించిన చిట్ చాట్ లో తమ్మినేని ఎక్కడ విషయాన్నీ దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు . ఎన్నికల్లో బీఆర్ యస్ తో కలిసి సిపిఎం పోటీచేస్తుంది అనే ప్రచారంపై మాట్లాడుతూ బీఆర్ యస్ తో కలిసి ప్రయాణం చేయాలనీ లేకున్నా పరిస్థితులు ఆవిధంగా నెట్టకొస్తున్నాయని అన్నారు . బీజేపీ ప్రమాదాన్ని నివారించే
ందుకు
తమ వంతు ప్రయత్నాలు చేస్తామన్నారు . ఇది మా కేంద్ర పార్టీ రాజకీయ నిర్ణయమన్నారు . మునుగోడు లో టీఆర్ యస్ మద్దతు ఇవ్వొద్దు అన్నవాళ్ళే బీజేపీ ఓటమికి మీరే కారణమని , మీ నిర్ణయం సరైందని ప్రశంసించారని పేర్కొన్నారు .

ఎన్నికల్లో బీఆర్ యస్ తో కలిసి పోటీచేయడం పవిత్రమా? అపవిత్రమా ? అనే విషయాలు ముందుకు వస్తున్నాయని , సీట్ల విషయంలో కూడా కేసీఆర్ తో ఎలాంటి చర్చలు జరగలేదని ఎన్నికల సందర్భంగా పొత్తులు ఎత్తులు ఉంటాయని అందువల్ల వాటి గురించి కాకుండా ప్రజల ,ప్రజాసమస్యలపై మా గొంతు వినిపిస్తాం అన్నారు . కేసీఆర్ తో పొత్తు ఉంటె ప్రజాసమస్యల విషయంలో మా పార్టీ వైఖరిని మార్చుకోబోమని తేల్చి చెప్పారు .అదే సందర్భంలో బీజేపీ కేసీఆర్ వైఖరి విషయంలో మార్పు ఉంటె చెప్పాల్సినకాడికి చెబుతాం తర్వాత వారి ఇష్టమని , రాజకీయాల్లో ఎవరి వైఖరి వారికీ ఉంటుందని కుండబద్దలు కొట్టారు .

కమ్యూనిస్టులు బలహీనపడ్డ మాట నిజం అంత మాత్రాన ప్రజల సమస్యలను విస్మరించం. పేదలు,బడుగు బలహీనవర్గాల తరుపున నిలిచేది , పోరాడేది ఎర్రజండాలే అని అన్నారు . ప్రజాపోరాటాలే మా ఆయుధాలని అందుకు సిపిఎం ప్రజాపక్షాన ఉద్యమాలు చేసేందుకు ముందుపీఠిన ఉంటుందని అన్నారు .

రాష్ట్రంలో 9 సీట్లపై గట్టిగ కసరత్తు చేస్తున్నాం వాటిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు , వైరా , ఖమ్మం , మధిర , భద్రాచలం ఉన్నాయని నల్లగొండ జిల్లాలో నకిరేకల్ , నల్గొండ , మిర్యాలగూడ , రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఉన్నాయని తమ్మినేని అన్నారు . పొత్తులు ఉంటె దాన్ని బట్టి పార్టీ నిర్ణయాలు ఉంటాయని అన్నారు . అదే సందర్భంలో పొత్తులు లేకపోతె 9 సీట్లే కాకుండా మరికొన్ని సీట్లలో పోటీచేసే అవకాశాలను తోసిపుచ్చలేమన్నారు .

కాంగ్రెస్ తో పొత్తుపై తమపార్టీ లైన్ క్లియర్ గా ఉందని ,ఒక్క రాజశేఖర్ రెడ్డి మొదటసారి సీఎం అయినప్పుడు మాత్రమే ఖమ్మం మినహా సిపిఎం కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలకు వెళ్లిందని అన్నారు . ఖమ్మంలో స్నేహపూర్వక పోటీ జరిగిందని సిపిఎం గెలిచిన విషయం గుర్తు చేశారు . కేంద్ర నాయకత్వం ఆదేశాల ప్రకారం లోకల్ పార్టీల విధివిధానాలపై ఆధారపడి పొత్తులు ఎత్తులు ఉంటాయన్నారు .సిపిఎం లో రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల్లో పోటీచేయరాదని నిబంధన ఉందని అయితే అది పార్టీ తీసుకొనే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తమ్మినేని స్పష్టం చేశారు . రాష్ట్ర కార్యదర్శిగా కూడా మూడు సంవత్సరాలకు మించి చేయకూడదని తన పదవీకాలం రెండు టర్మ్ లు అయిపోయిందని, మూడవ టర్మ్ కూడా ఇంకా రెండు సంవత్సరాలు మాత్రమే ఉందని చెప్పారు.

వ్య ..కా రాష్ట్ర సభల సందర్భంగా ఖమ్మంలో లక్షమందితో సభ

వ్యవసాయకార్మిక రాష్ట్ర సభల సందర్భంగా ఖమ్మం కాలేజీ గ్రౌండ్ లో లక్షమందితో బహిరంగ సభ నిర్విస్తామని అన్నారు . సభకు ముఖ్య అతిధిగా కేరళ సీఎం పినరాయ్ విజయన్ వస్తున్నారని అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు . చిట్ చాట్ లో పార్టీ రాష్ట్ర నాయకులూ పోతినేని సుదర్శన్ రావు , జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు , జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై .విక్రమ్ లు పాల్గొన్నారు .

 

Related posts

శివసేన రెబెల్స్ కు బంపరాఫర్ ప్రకటించిన బీజేపీ!

Drukpadam

తీన్మార్ మల్లన్న కష్టాలపై కేంద్ర హోమ్ మంత్రిని కలిసి ఫిర్యాదు చేసిన ఆయన భార్య !

Drukpadam

పశ్చిమ బెంగాల్ బీజేపీలో గుబులు.. ముఖ్యమైన సమావేశానికి నేతల గైర్హాజరీపై చర్చ!

Drukpadam

Leave a Comment