Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మంలో సిపిఎం వ్య .కా బహిరంగ సభ …హాజరు కానున్న కేరళ సీఎం పినరయ్ విజయన్ …

ఖమ్మంలో సిపిఎం వ్య .కా బహిరంగ సభ …హాజరు కానున్న కేరళ సీఎం పినరయ్ విజయన్ …

  ఖమ్మంలో వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగసభ
అరుణారుణ తోరణాలు…ఫ్లెక్సీలతో ఎరుపెక్కిన నగరం
* ముస్తాబవుతున్న ఎస్ఆర్అబీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజీ మైదానం
* హాజరుకానున్న కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్
* లారీలు, బస్సులు, వ్యాన్లలో వేలాదిగా తరలేందుకు సిద్ధం

ఖమ్మంలో జరగనున్న వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్రసభల సందర్భంగా గురువారం ఖమ్మంలో బహిరంగసభను ఏర్పాటు చేశారు . ఈసభలకు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ హాజరు కానున్నారు . దీంతో ఖమ్మంలో సిపిఎం ఈ సభలను జయప్రదం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం లోనే మకాం వేసి ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యేక్షిస్తున్నారు . ఖమ్మం ఎరుపుమయం అయింది. ఎటుచూసినా అరుణారుణ తోరణాలు, ప్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.

ఈనెల 29నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలో భాగంగా 29వ తేదీ సాయంత్రం ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగసభకు లక్షలాదిగా తరలాలని సంఘం నేతలు పిలుపునిచ్చారు. సుమారు లక్ష మంది వరకు ఈ సభకు రావచ్చని అంచనా వేస్తున్నారు. దానికి తగిన విధంగా సభా స్థలి ఖమ్మం ఎస్ఆర్అండ్అబీజీఎన్ఆర్ కళాశాల మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. సభా ఏర్పాట్లను వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు తమ్మినేని వీరభద్రం, వ్యవసాయ కార్మికసంఘం, రైతుసంఘం నేతలతో కలిసి మంగళవారం పరిశీలించారు.

గురువారం ఖమ్మంలో నిర్వహించే బహిరంగసభకు దండుగా కదులుతున్నారు. మూడువేలకు పైగా లారీలు, బస్సులు, వ్యాన్లను ఇప్పటికే ప్రాంతాల వారీగా స్వచ్ఛందంగా సిద్ధం చేసుకున్నారు. వ్యవసాయ కూలీలు, రైతులు, కౌలురైతులకు అండగా నిలవడంలో కేరళ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ బహిరంగసభకు కేరళ సీఎం విజయన్ ను ఆహ్వానించారు. ఆ రాష్ట్రంలో వ్యవసాయదారులు, కూలీల కోసం అమలవుతున్న పథకాలు, పర్యవసానాలు, ఫలితాలు తెలుసుకోవాలని ఊరూరా జనం కదలిరావాలని ఉవ్విలూరుతున్నారు. ఇప్పటికే ప్రతి ఊళ్లో ప్రచార రథాలు చెమటచుక్కల ప్రాధాన్యం తెలుపుతూ… కష్టజీవుల కష్టాన్ని దోచుకుంటున్న ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ… పాటల పరవళ్లతో బహిరంగ సభ కోసం ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ బహిరంగ సభకు లక్షలాదిగా రానుండగా…భక్త రామదాసు కళాక్షేత్రంలో 31వ తేదీ వరకు నిర్వహించే మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా 700 మంది ప్రతినిధులను ఆహ్వానించారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయ్ రాఘవన్, బి. వెంకట్ ఈ మహాసభల్లో ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. అటు బహిరంగసభకు, ఇటు మహాసభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.

వ్యవసాయ కార్మికసంఘం బహిరంగ, మహాసభల సందర్భంగా గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఈ ప్రదర్శన కోసం మూడువేల మంది రెడ్ షర్ట్ వాలంటీర్లు ఖాకీ పాయింట్, ఎర్రచొక్కాలు, ఎర్ర టోపీ, బూట్లు ధరించి ‘ఏక్ దో ఏక్’ అంటూ నగర వీధుల్లో కదం తొక్కనున్నారు. వీరిని అనుసరిస్తూ మరో రెండువేల మంది కళాకారులు, ఎర్రచీరలు ధరించిన నారీమణులు. ఆటపాటలతో అలరించనున్నారు. బహిరంగసభ ప్రాంగణం ప్రవేశద్వారం మొదలు సభా స్థలి వరకు కేరళ సీఎంకు వీరంతా ప్రత్యేక స్వాగతం పలుకుతారు.

Related posts

కొనేది ఎట్లా.. ? బతికేది ఎట్లా..?పీపుల్స్ మార్చ్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క!

Drukpadam

ఖమ్మంలో సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ ఎంపీ సాయం బాబురావు!

Drukpadam

హుజూరాబాద్​ లో దళితబంధు అమలులకు ఉత్తర్వులు …

Drukpadam

Leave a Comment