భద్రాచలంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మ..ఘనస్వాగతం పలికి మంత్రులు పువ్వాడ ,సత్యవతి రాథోడ్ …

భద్రాచలంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మ..ఘనస్వాగతం పలికి మంత్రులు పువ్వాడ ,సత్యవతి రాథోడ్ …
ఆర్మీ హెలికాఫ్టర్ లో బీపీఎల్ గ్రౌండ్ లో దిగిన రాష్ట్రపతి
రాష్ట్రపతి రాక సందర్భంగా భారీ బందోబస్తు

 

రాష్ట్రపతి హోదాలో దేశ ప్రధమ పౌరురాలు ద్రౌపది ముర్ము భద్రాచలం వచ్చారు .ఆమె రాక సందర్భంగా రాష్ట్ర,కేంద్ర బలగాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ , సత్యవతి రాథోడ్ లు రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు . ఆమె రాజమండ్రి నుంచి ప్రత్యేక ఆర్మీ హెలికాఫ్టర్ లో భద్రాచలం సమీపంలోని బీపీఎల్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకున్నారు . అక్కడ నుంచి ఆమె ప్రత్యేక వాహనంలో భద్రాచలంలోని శ్రీసీతారామ స్వామి దేవాలయానికి చేరుకున్నారు . ఆమె వెంట రాష్ట్ర గవర్నర్ తమిళశై ఉన్నారు .వేదం పండితులు ,ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు .

 

బిపిల్ పాఠశాలలో గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ అనుదీప్. బిపిఎల్ హెలిప్యాడ్ నుండి సీతారాముల దర్శనార్థం భద్రాచలం దేవస్థానానికి బయలు దేరి వెళ్లారు రాష్ట్రపతి వెంట ఆమె సిబ్బందితో పటు రాష్ట్ర గవర్నర్ తమిళశై ,ఇతర అధికారులు ఉన్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు . బీపీఎల్ క్రాస్ రోడ్ నుంచి భద్రాచలం వైపు వాహనాలను నిలిపివేశారు . భద్రాచలంలో వాహనాల దారిమల్లింపు చేశారు.జిల్లా కలెక్టర్ , ఎస్పీ ,ఇతర భద్రతా అధికారులు ప్రత్యక పర్వవేక్షణ చేశారు .

 

Leave a Reply

%d bloggers like this: