వ్యవసాయ కూలీలకు దిశానిర్దేశం చేయనున్న ఖమ్మం సభలు!

వ్యవసాయ కూలీలకు దిశానిర్దేశం చేయనున్న ఖమ్మం సభలు!
-29 బహిరంగ సభ …30 ,31 న ప్రతినిధుల సభలు
-హాజరు కానున్న కేరళ సీఎం విజయన్
-వివిధ జిల్లాలనుంచి రానున్న 700 మంది ప్రతినిధులు
-గ్రామీణ ప్రాంతాల్లో కూలీల సమస్యలపై చర్చలు
-ఉపాధి హామీ పథకాలపై చర్చ …
-భూమిలేని గిరిజనులకు పోడుభూములు ఇవ్వాలని డిమాండ్

ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లా గడ్డపై మరో చారిత్రక మహాసభలు జరుగుతుండడం అభినందనీయం …ఎర్రజెండా ఉద్యమాలను , కమ్యూనిస్ట్ ఉద్యమాలను మొదటినుంచి ఆదరిస్తున్న జిల్లాగా ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యత ఉంది. గొడ్డు చాకిరీ చేస్తూ గ్రామా పెత్తందార్లు ఇచ్చిన కాడికి కూలి తీసుకోని జీవితం
సమాజంలో అట్టడుగు వర్గాలుగా ఉండి రెక్కల కష్టం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వ్యవసాయ కూలీల సమస్యలపై చర్చిందెకు తెలంగాణ రాష్ట్ర సభలు జరుగుతున్నాయి. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను జరిపిన చరిత్ర కూడా ఖమ్మం కు ఉంది.

ఖమ్మం జిల్లాలో వ్యవసాయకార్మికోద్యమం ఘనమైన చరిత్రకల్గిఉంది. అనేక కూలి పోరాటాలు ఈ గడ్డపై జరిగాయి. ప్రధానంగా ముదిగొండ ,ఖమ్మం రూరల్ ,బోనకల్లు , చింతకాని ,కారేపల్లి , జూలూరుపాడు ,సత్తుపల్లి ,భద్రాచలం లాంటి ప్రాంతాల్లో బీడీ ఆకు సేకరణలో జరుగుతున్నా అన్యాలపై ,ప్రజలను చైతన్యపరిచి న్యాయమైన ధర రాబట్టి కూలీలకు అండగా నిలబడింది వ్యవసాయ కార్మిక సంఘం . ముదిగొండ మండలం బాణాపురం ప్రాంతంలో జరిగిన పోరాటానికి సిపిఎం నేత గండ్లూరి కిషన్ రావు నాయకత్వం వహించారు . జిల్లాలో అనేక గ్రామాల్లో కూలీలకు సంఘాలు పెట్టి సంఘటితం చేసిన చరిత్ర జిల్లాకు ఉంది . జిల్లాలో ఏలూరు లక్ష్మీనారాయణ , తమ్మినేని వీరభద్రం , పి. సోమయ్య ల ఆధ్వరంలో కూలిరేట్ల పెంపు ఉద్యమాలు జోరుగా జరిగాయి . గ్రామాలకు ,గ్రామాలూ ఈ ఉద్యమం లో పాల్గొన్నాయి. వ్యవసాకార్మిక ఉద్యమంతో జిల్లా అంతటా సమ్మెలు జరిగాయి. గ్రామాలకు గ్రామాలూ సమ్మెలో పాల్గొనడం ఆసంఘటితంగా ఉన్న కార్మికులను ఐక్యం చేశాయి. అనేక గ్రామాల్లో కూలి రేట్లు పెరగటానికి ఈ ఉద్యమాలు ప్రేరణగా నిలిచాయి. పార్టీలతో సంబంధం లేకుండా కూలీలు అందరు ఈ ఉద్యమం తమదిగా ఓన్ చేసుకున్నారు . దీంతో గ్రామాల్లో పెత్తందార్లకు వణుకు పుట్టింది. కొన్ని చోట్ల కూలి ఉద్యమాలపై కన్నెర్ర చేశారు .అయినప్పటికీ కూలీలు ఎక్కడ బెదరలేదు .మరింత పట్టుదలతో సమ్మెలో పాల్గొని కూలీరేట్లు పెంచుకోగలిగారు . ఇదే స్పూర్తితో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్రసభలో ఖమ్మం లో జరుగుతుండటం అభినందనీయం .రైతుకూలీలు సమస్యలపై ఈ సభల్లో లోతుగా చర్చించి సంఘాన్ని మరింత ఐక్యం చేసి బలోపేతం చేసేందుకు ఈ సభలు దోహదపడతాయని ఆశిద్దాం …ఈ సందర్భంగా గురువారం ఖమ్మం కాలేజీ గ్రౌండ్ లో జరగనున్న పెద్ద బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినారవి విజయన్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు . 30 ,31 తేదీలలో జరగనున్న ప్రతినిధుల సభలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలనుంచి 700 మంది హాజరు కానున్నారు . కార్మికుల సమస్యలతోపాటు , గిరిజనుల పోడుభూములు సమస్యపై కూడా ఈ సభల్లో తీర్మానం చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ప్రతినిధులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆహ్వానసంఘం ఆధ్వరంలో విస్తృత ఏర్పాట్లు చేస్తుంది.

Leave a Reply

%d bloggers like this: