Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం సభలో బీజేపీ పై నిప్పులు చెరిగిన కేరళ సీఎం పినారై విజయన్!

ఖమ్మం సభలో బీజేపీ పై నిప్పులు చెరిగిన కేరళ సీఎం పినారై విజయన్!
బీజేపీ ,ఆరెస్సెస్ సంఘ పరివార్ శక్తులు అడ్డుకునే శక్తి ఒక్క సీపీఎంకే ఉందన్న విజయన్
-2024 లో బీజేపీని గద్దె దించకపోతే పేదల బతుకులు బుగ్గిపాలు అవుతాయని హెచ్చరిక
నిరుద్యోగం , నిరక్షరాస్యత ,రైతు సమస్యలపై బలమైన ఉద్యమాల నిర్మాణం జరగాలి
పబ్లిక్ రంగసంస్థలను అమ్మే కుట్రజరుగుతుంది
ఉద్యోగుల భర్తీ లేదుసంక్షేమ పథకాలు ప్రజల హక్కు

 

సిపిఎం బహిరంగ సభకు భారీగా హాజరైన ప్రజలు

బీజేపీవిధానాలపై కేరళ సీఎం పినారై విజయన్ నిప్పులు కురిపించారు . బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల బతుకులు బుగ్గిపాలు అయ్యాయని దుయ్యబట్టారు . పైగా రైతులకు గిట్టుబాటు ధరలేదని ఫలితంగా ఇటీవల కాలంలో 4 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకర సంఘటనలు ఆయన ప్రస్తహించారు .సిపిఎం వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఖమ్మం < /span>నగరంలోని ఎస్ ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు .ఖమ్మం సభలో పాల్గొనడం సంతోషంగా ఉంది . కూలీల దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు గురించి ప్రస్తావిస్తూ . సుందరయ్య ,బసవపున్నయ్య లు పుట్టిన గడ్డపై మాట్లాడంటం తనకు ఆనందంగా ఉందన్నారు. వారు అందించిన పోరాటాల వారసత్వం మనకు ఉంది. ప్రజల హక్కులకోసం వారి చూపిన బాటలో పయనించాలని పిలుపు నిచ్చారు .
తెలంగాణ ఘనమైన పోరాటాలకు నిలయంముదిగొండ కూలిపోరాటాల సందర్భంగా అసువులు బాసిన మృతులకు జోహార్లు అర్పిస్తున్నట్లు తెలిపారు .

బీజేపీకి కాంగ్రెస్ రిక్రూట్మెంట్ ఏజెంట్ గా పనిచేస్తుందని విమర్శించారు .మనం ఆర్ ఎస్ ఎస్ త్రోవను అడ్డుకోవాలిఆశక్తి సిపిఎంకి మాత్రమే ఉంది . శ్రామికుల , రైతాంగ , హక్కులకోసమే పోరాడాలి అందుకు ఖమ్మం సభ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోవాలని విజయన్ ఆకాంక్షించారుసిపిఎం బలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి 2024 లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో బీజేపీని ఇంటికి పంపే బృహత్ కార్యక్రమాన్ని సిపిఎం తీసుకుంటుందని అన్నారు ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

75 సంవత్సరాల స్వతంత్ర పోరాట ఉత్సవాలు జరుపుకుంటున్నాం . నూతన భారత నిర్మాణానికి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారువలస వాదులకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలను పూర్వపక్షం చేసే కుట్ర జరుగుతుందని అన్నారు.అందుకు ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు .

మనకు నవభారతం కావాలిమతపరమైన ఉద్రేకాలు రెచ్చగొడుతున్నారు .మహాత్మా గాంధీ పై బుల్లెట్లు కురిపించిన వారు మేమే వారికీ వారసులమని చెప్పడం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు . .భిన్నత్వంలో ఏకత్వం మన విధానం . దానికనుగుణంగా మనం ప్రజలను ఐక్యం చేయాలనీ అన్నారు .

మనమంతా ఒకటివిభిన్న భాషలకు , సంస్కృతులకు , నిలయంగా మన దేశం ఉంది. మనమందరం ఒకటిగా ఉన్నాం ..ఉండాలిజాతీయవాదులు ఎవరు ? జాతి వ్యతిరేకులు ఎవరు ? ఎవరు నిర్ణయిస్తారు .బీజేపీ నిర్ణయిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు .పొరపాటుగా ,గ్రహపాటుగగాని స్వతంత్ర పోరాటంలో పాల్గొనని బీజేపీ నీతులు చెప్పేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని అన్నారు . కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విచ్చిన్నకర ధోరణలు పాల్పడుతున్నది .కేంద్ర ప్రభుత్వం హిందీ ని బలవంతంగా ప్రవేశ పెట్టాలని చూస్తున్నారని ఇది సరైన పద్దతికాదని అన్నారు. ఎవరం కూడా హిందీకి వ్యతిరేకం కాదు .బలవంతంగా రుద్దడం సరైంది కాదని చెపుతున్నామని విజయన్ అన్నారు .

ప్రజల ఐక్యత నాశనం చేయబడుతున్నప్పుడు మనం దైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంది .కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అధికారాలను అణిచి వేస్తుంది. హక్కులను హరిస్తున్నారు .బీజేపీ యేతర రాష్ట్రాలపై గవర్నర్ రూపంలో రాజకీయ ఏజంట్లుగా మార్చుకుంటుంది. ఒక్క కేరళ లోనే కాదు ,దేశంలోని బీజేపీయేతర రాష్ట్రాలలో చేస్తుంది.సమాఖ్య విధానాన్ని దెబ్బతీస్తుంది. అందువల్ల దానికి వ్యతిరేకంకంగా ప్రజలను ,లౌకిక శక్తులను ఐక్యం చేయాలనీ అన్నారు . మతోన్మాదం ,నూతన ఆర్థిక విధానాలు ,ఫలితంగా పేదల ,ధనికుల మధ్య అంతరం పెరిగింది. దేశం సాధించిన ఘనతలు హరించబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు .

11 లక్షల కోట్ల కార్పొరేట్లు రాయితీలు ఇచ్చింది. … రైతులకు రుణమాఫీ , పేదల రుణాల విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు . ఎస్ ఎస్ పథకం యూపీఏ ప్రభుత్వం హయాంలో వామపక్షాల వత్తిడితో తెచ్చింది .దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు .

దేశంలో 0 .33 శాతం మాత్రమే ఉద్యోగుల భర్తీ జరిగింది . 20 నుంచి 24 వయస్సు ఉన్న యువకులు 42 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు . సెంటర్ ఫర్ మానిటర్ ఎకానమీ లెక్కల ప్రకారం … 90 శాతం మంది పని చేయదగ్గ జనాభా ఉంది. అందులో 60 శాతం పని దొరకటం లేదని నిరాశతో ఉన్నారని విజయన్ పేర్కొన్నారు .

2016 నాటికీ 4 లక్షల ఖాళీ పోస్టులు ఉంటె అవి నేడు 8 లక్షల వరకు చేరుకున్నాయని అన్నారు . అగ్నిపథ్ పేరుతొ తాత్కాలిక ఉద్యోగులను నియమిస్తున్నారు. దీనిపై నిరుద్యోగ యువత తిరగబడుతున్న విషయాన్నీ గుర్తు చేశారు .

50 శాతం మంది ఇప్పటికి దేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటున్నారని అన్నారు . బీజేపీ అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాల ఫలితంగా వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టివేయబడిందన్నారు. 25 సంవత్సరాలుగా నూతన ఆర్థిక విధానాలు అమలు జరుగుతున్నాయి. 16 వేలమంది ప్రతిరోజూ ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు లెక్కలు తెలుపుతున్నాయి. ఫలితంగా కోటిన్నర మంది రైతులు వ్యవసాయాన్ని వదిలి పెట్టిన విషయాన్నీ గుర్తు చేశారు .

కేంద్రం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా దేశంలో ప్రజలు బతకలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు . 1991 నూతన అర్థక విధానాలు ….మతోన్మాదం ,పెట్టుబడిదారులు , రైతులపై దాడులు చేస్తున్నారని విజయన్ మండి పడ్డారు . పీఎం కిషన్ పథకం లెక్కలు చుస్తే 2019 లో 11 . 84 లక్షల నుంచి ఇప్పుడు 3 శాతం పడిపోయిందని అన్నారు

ఖమ్మం నగరంలో బహిరంగ సభ జరిగేనాటికి మున్నెన్నడూ లేనంత కేంద్రం రాష్ట్రాలపై దాడులు చేస్తుంది. కార్మికుల హక్కుల హరించ బడుతున్నాయని పేర్కొన్నారు .ప్రభుత్వ ఆస్తులు ప్రవేటీకరణ చేస్తూ కార్పొరేట్లకు అమ్ముతున్నారని ద్వజమెత్తారు .

సంక్షేమం ప్రజల హక్కుపౌష్టికరం లేదునిరుద్యోగంఉపాధి లేదు .వలస కూలీలు పెరుగుతున్నారు .ఉచితాలు అని అంటున్నారు .అవి ఉచితాలు కావు సంక్షేమం ప్రజల హక్కుఎన్ డి ని వ్యతిరేకించే శక్తి సిపిఎం ఉందని ప్రజల హర్షద్వానాల మధ్య అన్నారు .

కేరళలో సామజిక అసమానతలపై పోరాటాలు జరిగిన చరిత్ర ఉంది.విద్య, వైద్యంకు , పోరాటాలు జత చేశాం ….కేరళ లో దోపిడీ లేని పాలనా అందిస్తున్నాంసంక్షమే కార్యక్రమాలు చేపట్టాం …1957 లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారం అధికారంలోకి వచ్చింది.నాటి నుంచి అనేక ప్రజల అనుకూల మౌలిక సంస్కరణలు అమలు చేస్తున్నాం . భారత దేశం అంతా కూడా

అవినీతి తక్కువ ఉన్న రాష్ట్రంగా కేరళ ఉంది. అనేక రంగాల్లో ముందున్నాం . సుస్థిర అభివృద్ధి, క్రైమ్ రికార్డు ప్రకారం కేరళలో నేరాలు అతితక్కువగా ఉన్నాయి . అద్భుత ప్రగతి , భృణహత్యలు లేని రాష్టంగా కేరళ ఉంది .

55 లక్షల పెన్షన్లు ఇస్తున్నాంకేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తే మేమె కొంటాం అని చెప్పంఅత్యధికగంగా రోజు కూలి రూ 1600 అందుతుంది . 3 లక్షల ఇల్లు పేదలకు కట్టించి ఇచ్చాం . సభకు రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జి .నాగయ్య ,అధ్యక్షత వహించారు .సభలో ఆలిండియా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి .వెంకట్ ,సుదర్శన్ , నున్నా నాగేశ్వరరావు, తదితరులు పాల్గొని ప్రసంగించారు .

 

Related posts

మోడీకి గులాం నబీ ఆజాద్ కితాబు …కాంగ్రెస్ మండిపాటు …!

Drukpadam

తెలంగాణ బడ్జెట్ 2,56,958 కోట్లు.. బడ్జెట్ హైలైట్స్ – 1

Drukpadam

ఆ ప‌త్రిక సారీ చేప్పేదాకా వ‌దిలేదు లేదు: నారా లోకేశ్!

Drukpadam

Leave a Comment