Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

అమిత వేగంతో డివైడర్ పైకి దూసుకొచ్చిన పంత్ కారు… !

అమిత వేగంతో డివైడర్ పైకి దూసుకొచ్చిన పంత్ కారు… !

  • రోడ్డు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్
  • కాలిబూడిదైన కారు
  • డెహ్రాడూన్ ఆసుపత్రిలో పంత్ కు చికిత్స
  • వైరల్ అవుతున్న రోడ్డు ప్రమాద ఘటన 

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదం నుంచి గాయాలతో బయటపడడం తెలిసిందే. కారులో రూర్కీ వెళుతుండగా, పంత్ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు ఢిల్లీ-డెహ్రడూన్ జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది. గాయాలపాలైన పంత్ ను డెహ్రాడూన్ ఆసుపత్రికి తరలించారు. 

కాగా, హైవేపై ఉన్న సీసీటీవీ కెమెరాలో పంత్ కారు ప్రమాదానికి గురైన దృశ్యాలు రికార్డయ్యాయి. అతివేగంగా వచ్చిన కారు డివైడర్ పైకి దూసుకొచ్చింది. అనంతరం మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. 

ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఎవరైనా ప్రాణాలతో బయటపడడం అసాధ్యమనిపిస్తుంది. అదృష్టం కొద్దీ పంత్ ను అక్కడి వారు బయటికి తీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాద ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

క్రికెటర్ పంత్ ను రక్షించిన బస్ డ్రైవర్.. లేకపోతే సజీవదహనం అయిపోయేవాడే!

Bus driver saved Rishabh pant

ఘోర రోడ్డు ప్రమాదం నుంచి టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న బెంజ్ కారు డివైడర్ కు ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయడ్డాడు. కారు పూర్తిగా దగ్ధమయింది. ప్రస్తుతం పంత్ డెహ్రాడూన్ లో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు పంత్ కారుకు ప్రమాదం జరగిన వెంటనే ఆయనను రక్షించిన వారిలో హర్యానా రోడ్ వేస్ కు చెందిన బస్ డ్రైవర్ కూడా ఉన్నాడు. 

ఏం జరిగిందో బస్ డ్రైవర్ సుశీల్ మాన్ వివరించారు. ఎదురుగా చాలా వేగంతో వస్తున్న కారు డివైడర్ ను ఢీకొందని సుశీల్ మాన్ తెలిపాడు. వెంటనే తాను బస్సును రోడ్డు పక్కన ఆపేసి కారు దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లానని చెప్పాడు. వాస్తవానికి పల్టీలు కొట్టుకుంటూ వచ్చిన కారు బస్సు కిందకు దూరుతుందని భావించానని, అయితే కారు ఆగిపోయిందని తెలిపారు. కిటికీ నుంచి డ్రైవర్ (పంత్) శరీరం సగం బయటకు వచ్చిందని… తాను క్రికెటర్ అని ఆయన చెప్పాడని… తన తల్లికి ఫోన్ చేయమని తనను కోరాడని, కానీ ఆయన ఫోన్ స్విచాఫ్ అయిపోయిందని చెప్పాడు. 

తాను క్రికెట్ చూడనని, పంత్ అంటే ఎవరో తనకు తెలియదని అన్నాడు. అయితే తన బస్సులో ఉన్నవారు అతన్ని గుర్తించారని చెప్పాడు. వెంటనే పంత్ ను కారులో నుంచి బయటకు తీశామని… కారులో ఇంకా ఎవరైనా వున్నారేమోనని వెతికానని… ఒక బ్లూ బ్యాగ్ ను, రూ. 7 నుంచి 8 వేల డబ్బును కారు నుంచి తీశానని… అంబులెన్సులోకి ఎక్కించిన తర్వాత వాటిని ఆయనకు (పంత్) ఇచ్చానని తెలిపాడు. ప్రమాద సమయానికి బస్సు అక్కడకు రావడం, కారు నుంచి బయటకు లాగడంతో పంత్ ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే దగ్ధమైపోయిన కారుతో పాటు ఆయన సజీవదహనం అయిపోయేవాడు. 

Related posts

గ్యారపట్టి ఎన్ కౌంటర్ పచ్చిబూటకం: మావోయిస్టు పార్టీ!

Drukpadam

ఫోన్ ట్యాపింగ్‌లో కీలకమైన పాత డేటా మాయం…42 హార్డ్‌డిస్క్‌లు మూసీలో కలిపేశారు…

Ram Narayana

సైదాబాద్‌ సింగ‌రేణి కాల‌నీ బాలికపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డ నిందితుడు రాజు ఆత్మ‌హ‌త్య‌!

Drukpadam

Leave a Comment