ఒక్కడి నుంచే రూ.28 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్లు!

ఒక్కడి నుంచే రూ.28 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్లు

  • జొమాటోపై ఈ ఏడాది ఆర్డర్ ఇచ్చిన పూణె వాసి
  • మరో వ్యక్తి 25 వేల పిజ్టాలకు ఆర్డర్
  • ఢిల్లీకి చెందిన మరో యూజర్ 3,300 ఆర్డర్లు

జొమాటో యాప్ లో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఈ ఏడాది 3300 ఆర్డర్లు ఇచ్చినట్టు ఇటీవలే వెల్లడించిన ఫుడ్ డెలివరీ సంస్థ.. ఈ ఏడాదికి సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. పూణె వాసి ఒకరు 2022లో జొమాటో ప్లాట్ ఫామ్ పై రూ.28 లక్షల విలువ చేసే ఫుడ్ కోసం ఆర్డర్లు ఇచ్చాడు. ట్విట్టర్ ధర కంటే ఇది కేవలం రూ.36,42,17,44,48,38 తక్కువ అంటూ జొమాటో ఇన్ స్టా గ్రామ్ లో ఆసక్తికరంగా క్యాప్షన్ పెట్టింది.

మరో వ్యక్తి 25,000 విలువ చేసే పిజ్జాలకు ఈ ఏడాది ఆర్డర్లు ఇచ్చాడు. ఇంకో వ్యక్తి 1,098 కేక్ లు కావాలంటూ ఆర్డర్లు పెట్టాడు. ఒక యూజర్ అయితే డిస్కౌంట్ ఆఫర్లతో 6.96 లక్షలను ఆదా చేసుకున్నాడు. నిమిషానికి 136 బిర్యానీ ఆర్డర్లను జొమాటో ఈ ఏడాది డెలివరీ చేసింది.

Leave a Reply

%d bloggers like this: