Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కీలక నిర్ణయం దిశగా మాజీ ఎంపీ పొంగులేటి ఆలోచన ….!

కీలక నిర్ణయం దిశగా మాజీ ఎంపీ పొంగులేటి ఆలోచన ….!
-పార్టీ మార్పు వైపే అడుగులు …అందుకే తమ టీం అంతా పోటీలో ఉంటుందని వెల్లడి
-గత మూడున్నర సంవత్సరాలుగా బీఆర్ యస్ ఏమి చేసిందో చూస్తున్నారని అసహనం
-బీజేపీలో చేరాలని ఆయనపై వత్తిడి …కాంగ్రెస్ లో చేరాలంటున్న అనుయాయులు
-పొంగులేటి దారిలో జిల్లాలో మరికొందరు ముఖ్యనేతలు

మాజీ ఎంపీ ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ యస్ అసంతృప్త నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారబోతున్నారనే వార్తలు గత సంవత్సర కాలంగా వస్తూనే ఉన్నాయి. పార్టీలో కనీస గౌరవ మర్యాదలు దక్కడంలేదనే అసంతృప్తితో ఉన్నారు … నూతన సంవత్సరం సందర్భంగా ఖమ్మంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన వేడుకల సందర్భంగా పార్టీ మార్పుపై తన మనుసులో మాట చెప్పకనే చెప్పారు . గత మూడున్నర సంవత్సరాలుగా బీఆర్ యస్ లో ఎలాంటి గౌరవం దక్కుతుందో మీకందరికీ తెలియంది కాదని చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు ఎక్కడ తాగాలలో అక్కడ తగిలాయి. అసవరం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు . పైగా ఎన్నికల్లో తనతోపాటు తన టీం అంతా పోటీలో ఉంటుందని ప్రకటించడంతో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. విశ్లేషకులు సైతం పొంగులేటి పార్టీ మార్పు అనివార్యం అనే అభిప్రాయాలనే వ్యక్తం చేస్తున్నారు .

2014 లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పొంగులేటి వైసీపీ టికెట్ పై పోటీచేసి ఎంపీగా విజయం సాధించారు . ఆయన కాకుండా ఆయనతోపాటు జిల్లాలో మూడు అసెంబ్లీ సీట్లలో విజయ ఢంకా మోగించి తెలంగాణ నుంచి అటు లోకసభలో , ఇటు తెలంగాణ అసెంబ్లీ లో వైసీపీకి ప్రాతినిధ్యం కల్పించారు . అప్పటివరకు కొందరికే తెలిసిన పొంగులేటి పెద్ద పాపులర్ లీడర్ గా గుర్తింపు పొందారు . పైగా వైసీపీ తెలంగాణ అధ్యక్షులుగా కీలక భాద్యతలు స్వీకరించారు . అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో తనతోపాటు వైసీపీ ఎమ్మెల్యేలు అంతా కేసీఆర్ పిలుపు మేరకు గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు . పార్టీలో చేరిన సందర్భంగా కేసీఆర్ ఆయనకు తిరిగి లోకసభ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ 2019 లోకసభ ఎన్నికల్లో సీటు ఇవ్వలేదు . పైగా తర్వాత రాజ్యసభకు పంపుతానని కేసీఆర్ హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. అది నెరవేర లేదు . దీంతో పొంగులేటి అభిమానులు గులాబీ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు .

పొంగులేటికి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటు ఇస్తారని అనుకున్నప్పటికీసీఎం కేసీఆర్ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు . పార్టీ ,పార్టీ అని తిరుగుతున్నప్పటికీ పార్టీలో కనీస గౌవరం లేకపోవడంపై ఆయన అనుయాయులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు .

అయనప్పటికీ జిల్లాలో ఆయన ప్రజల మధ్య నిత్యం తిరుగుతున్నారు . ఆయన వెంట అనేకమంది ముఖ్యనేతలు సైతం ఉంటున్నారు . ప్రధానంగా మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు , డీసీసీబీ డైరక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య , పాలేరు నియోజకవర్గ మాజీ ఇంచార్జి స్వర్ణ కుమారి . పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు , సత్తుపల్లి నుంచి డాక్టర్ మట్టా దయానంద్ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి , మరో కీలక నేత బొమ్మెర రామ్మూర్తి , డాక్టర్ కోట రాంబాబు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య , భద్రాచలం పార్టీ ఇంచార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు , రాష్ట్ర డీసీఎంస్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ లాంటి ముఖ్యనేతలు ఆయన వెంట ఉన్నారు .

పొంగులేటి ఎంపీగా ఉన్నప్పటికంటే లేకుండానే ఎక్కువగా ప్రజల్లో తిరుగుతున్నారు . ఊరు వాడ ,తిరుగు తున్నారు .అక్క , అన్న , అమ్మ , పెద్దాయన , అంటూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు దీంతో ఆయనకు ప్రజల్లో మంచి ఆదరణే ఉంది . అయినప్పటికీ గులాబీ పార్టీ ఆయన్ను ఆదరించడంలేదనే బలమైన అభిప్రాయాలు ప్రజల్లోకి వెళ్లాయి. అందువల్ల ఆయన పార్టీ మార్పు అనివార్యం అవుతుందనే చర్చ జరుగుతుంది. పార్టీ మారితే ఆయన ముందున్న మార్గాలు ఏమిటి ? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడమా ? లేక ఆయన అనుయాయిలు వత్తిడి మేరకు కాంగ్రెస్ లో చేరడమా? అనే ప్రత్యాన్మాయలు ఉన్నాయి. షర్మిల పార్టీలో చేరుతారనే పుకార్లు కూడా ఉన్నప్పటికీ ఆయనకు ఆ ఆలోచన లేదని తెలుస్తుంది. ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఏ ఎన్నికలు ముందు వచ్చిన పోటీ ఖాయమని తరుచు అంటున్న పొంగులేటి కేటీఆర్ పై ఎక్కడో ఒక చోట నమ్మకం ఉంది . ఆయన ఆదరిస్తారని అక్కున చేర్చుకుంటారని అనుకుంటున్నారు . అయితే అది దింపుడు కళ్లం లాంటిదే అనే అభిప్రాయాలు ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల నుంచి సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ లేదు …ఎక్కడన్న కలిసిన అది నమస్కారాలకే పరిమితం … తన కూతురి పెళ్లి సందర్భంగా కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సైతం కేటీఆర్ సీఎం దగ్గరకు స్వయంగా తీసుకోని వెళ్లారు అక్కడ సీఎం ముభావమే… అందువల్ల తన రాజకీయ జీవితం కేసీఆర్ తోనే అని చాలాసార్లు చెప్పిన పొంగులేటి అక్కడ ఆదరణ లేకపోవడం తో వేరేదారి ఎతుక్కుంటున్నారు . పొంగులేటి బాటలోనే జిల్లాకు చెందిన మరికొందరు ప్రత్యాన్మాయం వైపు చేస్తున్నారు. చూద్దాం ఏమి జరుగుతుందో మరి ….!

Related posts

‘తన్నులాట’ గురించి ఇంతకన్నా బాగా ఎవరూ చెప్పలేరు: రేవంత్‌రెడ్డి

Drukpadam

గట్టు శ్రీకాంత్ రెడ్డి వైసీపీ కి గుడ్ బై…

Drukpadam

ఏపీతో జల వివాదం.. ఢిల్లీకి వెళ్తున్న కేసీఆర్!

Drukpadam

Leave a Comment