జనజాతర తలపించిన … కందాల జన్మదినోత్సవ  వేడుకలు …!

జనజాతర తలపించినకందాల జన్మదినోత్సవ  వేడుకలు …!
అభినందనల వెల్లువతో తడిసి ముద్దైన కందాల
ప్రత్యేక వేదికపై నిలుచొని వచ్చిన అభిమానులందరినీ హృదయానికి హత్తుకున్న కందాల
ఒక్క పాలేరు నియోజకవర్గం నుంచే తరలి వచ్చిన వేలాదిమంది
అందరికి భోజనాలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే
కుటుంబ సభ్యులంతా దగ్గరుండి అందరికి భోజనాలు అందేలా చర్యలు

 

ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు కూసుమంచి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. వేడుకలకు వేలాదిమంది తరలి రావడంతో జనజాతరను తలపించింది. అభిమానుల , బీఆర్ యస్ కార్యకర్తల , ప్రజాప్రతినిదుల , అనుయాయుల అభినందనలతో కందాల తడిసి ముద్దయ్యారు . ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న స్థలంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికమీద నిలుచొని అందరిని పేరు పేరున పలకరించారు . అందరిని ఆప్యాయంగా హత్తుకున్నారు . ప్రజల ఒక్క పాలేరు నియోజకవర్గం నుంచే భారీగా తరలి రావడం విశేషం .వచ్చిన వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేశారు . ఒకపక్క అభినందనలు మరోపక్క భోజనాల ఏర్పాట్లపై ఆరావచ్చినవారు అందరు తృప్తిగా తిన్నారా లేదా ? అని వాకబుకుటంబసభ్యులను భోజనాల దగ్గరకు పంపించి అందరికి భోజనాలు అందుతున్నాయా ?లేదా అని తెలుసుకోవడం చేశారు .ఆటోలు ,ట్రాక్టర్లు , కార్లు , ఇతర వాహనాలు ద్వారా ప్రజలు తరలి వచ్చారు. ఒకపక్క సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఈనెల 18 ఖమ్మం లో జరగనున్న బీఆర్ యస్ బహిరంగ సభకు ప్రజలను సమీకరించేందుకు వెంటనే హైద్రాబాద్ రావాలని పిలుపుజన్మదినోత్సవాలు జరుగుతుండగా ప్రజలను కలుసున్న తర్వాతహైద్రాబాద్ సీఎం సమావేశంలో పాల్గొనేందుకు హుటాహుటిన హైద్రాబాద్ కు బయలు దేరారు .

అంతకు ముందు రాత్రి 12 గంటలకే బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేశారు . సందర్భంగా కుటంబ సభ్యులు ఆయనకు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు . రాత్రి కేక్ కట్ చేసే వరకు  హితులు ,సన్నిహితులు క్యాంపు కార్యాలయం లో ఉండి అభినందనలు తెలిపారు . సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ , మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ , జిల్లాకు చెందిన ఎంపీలు నామ నాగేశ్వరరావు ,వద్దిరాజు రవి చంద్ర, బండి పార్థ సారథిరెడ్డి , ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య , వనమా వెంకటేశ్వరరావు , రేగా కాంతారావు , రాములు నాయక్ , హరిప్రియ , మెచ్చా నాగేశ్వరరావు , ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు అభినందనలు తెలిపారు .

Leave a Reply

%d bloggers like this: