Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం గుమ్మంలో బీఆర్ యస్ ప్రజా గర్జన…సభకు 5 లక్షల మంది!

దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేయనున్న ఖమ్మం బీఆర్ యస్ సభ !
ఖమ్మం గుమ్మంలో బీఆర్ యస్ సభకు 5 లక్షల మంది!
కేసీఆర్ తోపాటు నలుగురు సీఎంలు పలువురు జాతీయ నేతలు హాజరు…
ఖమ్మం సభ ద్వారా బీజేపీని ఎదుర్కొనే సత్తా తమకే ఉందని చాటి చెప్పే ప్రయత్నం
కనీవిని ఎరుగని రీతిలో 100 ఎకరాల్లో …5 లక్షలమందికి ఏర్పాట్లు
సభ ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు

దేశరాకీయాలకు ఖమ్మం ఒక చారిత్రక వేదిక కాబోతుంది. తెలంగాణా సీఎం కేసీఆర్ పెట్టిన భారత రాష్ట్ర సమితి( బీఆర్ యస్ ) మొట్టమొదటి సభను జిల్లా కేంద్రమైన ఖమ్మం లో పెట్టడం ఒక మైలు రాయి కాబోతుంది . ఈసభ ద్వారా బీజేపీకి తామే నిజమైన ప్రత్యాన్మాయమని చెప్పడమే కేసీఆర్ ఉద్దేశం . దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కృతనిశ్చయంతో ఉన్న కేసీఆర్ బీజేపీపై యుద్దానికి సిద్ధమైయ్యారు . బీజేపీ అప్రజాస్వామిక విధానాలను ఖమ్మం సభ ద్వారా ఎండగట్టాలని నిర్ణయించుకున్న కేసీఆర్, అందుకు తాను మిత్రపక్షాలుగా భావిస్తున్న పార్టీలను, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను దీనికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు .

పార్టీని స్థాపించిన తర్వాత కేసీఆర్ మొదటి సభను దేశరాజధాని ఢిల్లీలో భారీ ఎత్తున పెట్టాలని నిర్ణయించుకున్నారు . అయితే ఇప్పుడు సభ జరుగుతుంది. కాని వేదిక మారింది. దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణలోని ఉద్యమాల గుమ్మం ఖమ్మం సభకు వేదిక కానున్నది .జిల్లా ప్రజాప్రతిధుల కోరికమేరకు ఖమ్మంలో సభ పెట్టేందుకు బీఆర్ యస్ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ అంగీకరించారు . ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సభ ఏర్పాట్లు జనసమీకరణపై సీఎం ప్రగతి భవనంలో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు .

దీంతో రంగంలోకి దిగిన మంత్రి అజయ్ , ఇతర ప్రజా ప్రతినిధులు సభకు జనసమీకరణ , ఏర్పాట్లపై దృష్టిపెట్టారు . ఖమ్మంగుమ్మంలో ఈనెల 18 న బీఆర్ యస్ పార్టీ ప్రజా గర్జన సభను జిల్లా చరిత్రలో కనివిని ఎరగని రీతిలో జరిపందుకు శ్రమిస్తున్నారు . జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వరంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ,సీపీ లు సభకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూస్తున్నారు . బుధవారం మంత్రి అజయ్ తోపాటు ఎంపీలు నామ నాగేశ్వరరావు , వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ జిల్లా బీఆర్ యస్ అధ్యక్షుడు తాతా మధు ,ఖమ్మం మేయర్ పూనుకొల్లు నీరజ నూతన కలెక్టరేట్ తోపాటు సభాస్థలిని పరిశీలించారు .

కేసీఆర్ తోపాటు నలుగురు ముఖ్యమంత్రులు పలువురు జాతీయపార్టీల కీలక నాయకులు ఈ సభకు రానున్నారు . హాజరు కానున్న సీఎం లలో కేజ్రీవాల్ ,పంజాబ్ సీఎం , ఝార్ఖండ్ సీఎం యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ , సిపిఎం , సిపిఐ కార్యదర్శులు సీతారాం ఏచూరి , డి .రాజా,కర్ణాటక కుమారస్వామి,పలువురు రైతుసంఘనాయకులు హాజరు కానున్నట్లు తెలుస్తుంది . జాతీయ పార్టీల నేతలు పాల్గొనే ఈ సభను సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు . ఖమ్మం నేతలమీద ఆయనకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నేతలుసైతం ఐక్యంగా సన్నాహాలు చేస్తున్నారు . బీఆర్ యస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఢిల్లీలో లో పెడదామనుకున్న సభ ఖమ్మం కు మార్చడంపై అందరి ద్రుష్టి ఖమ్మం పై సహజంగానే పడింది. అనేక మార్పులకు వేదికైన ఖమ్మం నుంచి బీఆర్ యస్ శంఖారావం పూరించడం ద్వారా పార్టీని దేశవ్యాపితంగా పరుగులు పెట్టించవచ్చునను కేసీఆర్ భావనగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ సందర్భంగా కొత్తగా 50 కోట్ల రూపాయలతో నిర్మించిన జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (నూతన కలెక్టర్ కాంప్లెక్స్ ) ను సీఎం కేసీఆర్ ప్రారంభయించనున్నారు . పక్కనే 100 ఎకరాల్లో సభ ఏర్పాటుకు సిద్ధం చేశారు . 5 లక్షల మందిని సమీకరించాలనే ఆలోచనతో ఏర్పాట్లు చేస్తున్నారు . ఇప్పటికే ఖమ్మం అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కుతుండగా కొత్త కలెక్టరేట్ ఖమ్మంనికి మరో మణిహారంగా మారనున్నది . తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏమి జరిగిందో తెలియదుగాని ఖమ్మాన్ని మాత్రం కొత్తగా ఆవిష్కరించినట్లు అయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే మంత్రి అజయ్ ఖమ్మం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు . రాష్ట్రంలోనే ఖమ్మం అభివృద్ధి ఒక రోల్ మోడల్ గా మారింది. అనేక జిల్లాలనుంచి వచ్చి ఖమ్మం అభివృద్ధిని చూసి వెళ్ళుతున్నారు .ఇప్పుడు దేశం ఖమ్మం వైపు చూస్తుంది.

Related posts

ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఆదివాసీ మహిళ ద్రౌప‌ది ముర్ము.. బీజేపీ అధ్యక్షుడు నడ్డా ప్రకటన!

Drukpadam

పాకిస్థాన్​ ఆర్మీ అదుపులో తాలిబన్​ అధిపతి.. భారత్​ కు నిఘా వర్గాల సమాచారం!

Drukpadam

రాయల తెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదు: టీఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి…

Drukpadam

Leave a Comment